»   » శర్వా ‘రాధ’టీజర్: పవన్ సూపర్ హిట్ ని కాపీ కొట్టినట్లే ఉందేంటి?

శర్వా ‘రాధ’టీజర్: పవన్ సూపర్ హిట్ ని కాపీ కొట్టినట్లే ఉందేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:శతమానం భవతి చిత్రంతో మంచి హిట్ కొట్టి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న శర్వానంద్ మరో సరికొత్త చిత్రం 'రాధ'. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో శర్వానంద్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. అతనికి జోడీగా లావణ్య త్రిపాఠి తొలిసారి ఆడిపాడనుంది. అయితే ఈ టీజర్ చూసిన వారంతా ..ఇదేంటిది ...గబ్బర్ సింగ్ ని మళ్లీ రీమేక్ చేస్తున్నారా... అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి..మీకూ అదే డౌట్ రావచ్చు.


బోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ గబ్బర్ సింగ్ ని పూర్తి స్దాయిలో గుర్తు చేస్తున్న ఈ ట్రైలర్‌లో శర్వానంద్ సీరియస్‌గా ఉంటూనే తన పంక్తు కామెడీ పండించే ప్రయత్నం చేసాడు. గూండాలను పోలీస్ స్టేషన్ లో డీల్ చేసే పద్దతి చూస్తూంటే గబ్బర్ సింగ్ లో సీనే గుర్తుకు వస్తోంది.


అఫ్ కోర్స్ టీజర్ లోని ఇంకొన్ని షాట్స్ చూస్తూంటే విజయ్ హీరోగా వచ్చి, దిల్ రాజు రిలీజ్ చేసిన పోలీసోడు (తమిళంలో తెరి) చిత్రం ట్రైలర్ కూడా గుర్తుకు వస్తుంది. మరీ ఇలా గుర్తుకు వస్తుందని తెలిసినా అలాగే ఫస్ట్ లుక్ టీజర్ ని కట్ చేయటం వెనుక దర్శకుడు, హీరో వ్యూహం ఏమిటో తెలియటం లేదు.


ఇక ఈ చిత్రంలో బోజ్ పురి నటుడు రవికిషన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి రాధ అనే టైటిల్ కూడా వీళ్ల ఐడియా కాదు. గతంలో వెంకీ సినిమాను ఇదే టైటిల్ తో తెరకెక్కించాలని మారుతి భావించినప్పటికి చివరి మూమెంట్ లో నిర్ణయం మార్చుకున్నాడు. శర్వానంద్ తాజా చిత్ర షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకోగా, సమ్మర్ లో ఈ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు.


సమర్పకులు బి వి ఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ, " పూర్తి వినోదాత్మకం గా ఈ చిత్రం ఉంటుంది. నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ బాగుంది. రొమాన్స్, కామెడీ , ఏక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా కి రాధ అనే టైటిల్ చక్కగా సరిపోతుంది. ఉగాది రోజున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం ", అని అన్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత భోగవల్లి బాపినీడు.

English summary
Sharwanand's upcoming film 'Radha'teaser has been unveiled and it gives a feeling that the film has been modeled on Pawan's 'Gabbar Singh' formula.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu