»   » బాబు తెలివైనోడు..అందుకే ఫ్రీ ఫ్రీ అన్నాడు

బాబు తెలివైనోడు..అందుకే ఫ్రీ ఫ్రీ అన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రజలకు ఉపయోగపడే సామాజిక సందేశం ఉన్న కధాంశం ఉన్న చిత్రంలోనో, లేక చితికిపోయిన నిర్మాతను బ్రతికించటానికో, లేక ఆఫర్స్ కరువ అయ్యి...తనను ఎవరూ బుక్ చేసుకోనప్పుడో హీరోలు ఫ్రీగా చేస్తూంటారు. అయితే తాజాగా బిజిగానే ఉన్న శర్వానంద్ శర్వానంద్ తన తాజా చిత్రం రన్ రాజా రన్ లో ఫ్రీ గా నటించానంటూ చెప్పుకొచ్చారు.ఆ మొత్తాన్ని పబ్లిసిటీపై ఖర్చుపెడతారనే ఉద్దేశ్యంతో ఫ్రీగా చేసారని చెప్తున్నారు. అంటే శర్వానంద్ తన చాలా తెలివిగా ఈ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాడంటున్నారు. ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో అలా చేసాడని అంటున్నారు.

శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న 'రన్ రాజా.. రన్' పాటలు మార్కెట్‌లో విడుదలయ్యాయి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూర్చారు.

Sharwanand acting free in Run Raja Run

ప్రభాస్ మాట్లాడుతూ "కొరటాల శివను దర్శకుడిగా పరిచయం చేసి 'మిర్చి'తో పెద్ద విజయాన్ని అందుకున్న వంశీ, ప్రమోద్ ఇప్పుడు సుజిత్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ 'రన్ రాజా రన్'ను తీస్తుండటం సంతోషంగా ఉంది. 24 ఏళ్ల వయసులో సుజిత్‌లో ఇంత ప్రతిభ ఉందని నేను ఊహించలేదు. పబ్లిసిటీ కోసం ఈ నిర్మాతలు బాగా ఖర్చు పెడతారనే నమ్మకంతో శర్వానంద్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ అడగలేదు'' అని చెప్పారు.

అడివి శేష్, సంపత్, జయప్రకాశ్‌రెడ్డి, వెన్నెల కిశోర్, అలీ, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: ఘిబ్రాన్ ఎం., ఛాయాగ్రహణం: మధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.

English summary

 Prabhas revealed that Sharwanand is acting in the film without remuneration. According to Prabhas, Sharwa was blown away by Run Raja Run script and reportedly requested the makers to invest his remuneration on the movie which crossed the limits in terms of budget
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu