twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శర్వానంద్ చెయ్యకపోతే నేనే చేస్తా: రామ్‌ చరణ్‌(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: ''బాలీవుడ్‌లో గొప్ప స్టార్లు అనదగ్గ వారందరూ ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో మాత్రం మేం చేయలేకపోతున్నాం. కారణం స్టార్స్‌గా ఇక్కడ మాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉండటమే. శర్వాకు ఆ పరిధుల్లేవు. అభిరుచికి తగ్గ సినిమాలు చేస్తూ తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు. నిర్మాతగా శర్వా ఈ సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోతే... నేనే ప్రమోట్ చేస్తా.

    ఎందుకంటే ఇది అంత మంచి సినిమా''అని రామ్ చరణ్ చెప్పారు. రామ్‌చరణ్‌. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన 'కో అంటే కోటి' పాటల వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ చిత్రంలో శర్వానంద్‌, ప్రియా ఆనంద్‌ జంటగా నటించారు. అనీష్‌ యోహాన్‌ కురువిల్లా దర్శకుడు. మైనేని వసుంధరాదేవి నిర్మాత. శక్తికాంత్‌ కార్తిక్‌ స్వరాలు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో శేఖర్‌ కమ్ముల, బి.గోపాల్‌, కేఎస్‌ రామారావు, స్రవంతి రవికిశోర్‌, నవదీప్‌, ఎస్‌.గోపాల్‌రెడ్డి, మైనేని ప్రసాదరావు, శిరీష ముల్పూరి, శ్రేష్ట, దేవా కట్టా, సందీప్‌కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

    రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలు ఇలాంటి చిన్న సినిమా పంక్షన్స్ కి రావటం మంచి పరిణామమని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ సైతం నితిన్ ఇష్క్ చిత్రం ఆడియోకి రావటంతో ఆ సినిమాకు క్రేజ్ వచ్చింది. అంతకుముందు అల్లు అర్జున్.. ఈ రోజుల్లో చిత్రం ఆడియోకి వచ్చారు. ఇలా మెగా హీరోలు... తమ తోటి నటులు ఆడియో లు కు వచ్చి ఆ చిత్రానికి క్రేజ్ పెంచటం, అందరి దృష్టిలో పడేలా చేయటం ఓ గుడ్ విల్ ని స్పెడ్ చేస్తోంది.

    శర్వానంద్ చెయ్యకపోతే నేనే చేస్తా: రామ్‌ చరణ్‌(ఫొటో ఫీచర్)

    చిత్రం తొలి సీడీని రామ్ చరణ్‌, శ్రీహరి ఆవిష్కరించి శర్వానంద్ తల్లిదండ్రులకు అందించారు. ప్రస్దానం దర్శకుడు దేవకట్టా చిత్రం డైలాగ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

    శర్వానంద్ చెయ్యకపోతే నేనే చేస్తా: రామ్‌ చరణ్‌(ఫొటో ఫీచర్)

    ''విశాల్‌ భరద్వాజ్‌ లాంటివాళ్లు హిందీలో చేస్తున్న ప్రయోగాత్మక చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమవుతున్నాయి. ఇక్కడ శర్వానంద్‌ ఆ తరహా చిత్రాలు చేస్తున్నారు. అలాంటి స్వేచ్ఛ మాకూ కావాలి. శర్వా నాకు పదో తరగతి నుంచి పరిచయం. నాకున్న సన్నిహిత మిత్రులు ముగ్గురిలో శర్వా ఒకడు. వారే శర్వానంద్, విక్రమ్, రానా. ఈ ముగ్గురూ నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. శర్వా ఈ చిత్రం ద్వారా నిర్మాతగా కూడా మారడం ఆనందంగా ఉంది. 'శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్‌' నుంచీ తను విభిన్నమైన మార్గంలో వెళ్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది. అందుకు మంచి ప్రచారం అవసరం. శర్వా చేయకపోతే నేనే స్వయంగా వచ్చి సినిమాను ప్రమోట్‌ చేస్తా'' అన్నారు.

    శర్వానంద్ చెయ్యకపోతే నేనే చేస్తా: రామ్‌ చరణ్‌(ఫొటో ఫీచర్)

    ''మగధీరతో నటుడిగా నాకు దాహం తీరిపోయిందనుకున్నాను. కో అంటే కోటితో మరి కొంత దాహం తీరింది. చరణ్‌ 'జంజీర్‌'లో షేర్‌ఖాన్‌ పాత్ర పోషించబోతున్నాను. నేను ఈ సినిమాలో నటించలేదు. దర్శకుడుకి సరెండర్ అయిపోయానంతే.. ఇందులోని నా పాత్రకు ఎంత పేరొచ్చినా ఆ క్రెడిట్ మొత్తం దర్శకునిదే'' అన్నారు శ్రీహరి.

    శర్వానంద్ చెయ్యకపోతే నేనే చేస్తా: రామ్‌ చరణ్‌(ఫొటో ఫీచర్)

    ''చిత్ర పరిశ్రమకు వచ్చి పదేళ్లయింది. ఏదో అయిపోదామని సినిమాలు చేయడం లేదు. మంచి కథలు ఎంచుకొని ప్రేక్షకుల్ని రంజింపచేయాలన్నదే నా తపన. దర్శకుడు అనీష్‌ కథ చెప్పినప్పుడే కళ్ల ముందు సినిమా మెదిలింది. చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు నాకు అండదండగా నిలుస్తున్నారు''అన్నారు శర్వానంద్.

    శర్వానంద్ చెయ్యకపోతే నేనే చేస్తా: రామ్‌ చరణ్‌(ఫొటో ఫీచర్)

    హీరో మంచు మనోజ్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా షూటింగ్‌కి ముందు శర్వా ట్రైలర్‌ని చూపించాడు. విస్తుపోయాను. 'కో అంటే కోటి' ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొంటుంది''అన్నారు.

    శర్వానంద్ చెయ్యకపోతే నేనే చేస్తా: రామ్‌ చరణ్‌(ఫొటో ఫీచర్)

    అనీష్ సరికొత్త సంతకం ఈ సినిమా అని, శర్వానంద్ లాంటి అభిరుచి గల నటుడు తనకు తోడవ్వడం ఈ సినిమాకు మరింత శోభను తెచ్చిందని శేఖర్‌ కమ్ముల చెప్పారు.

    English summary
    Ko Ante Koti Audio Launch Function held at Hitex City in Hyderabad. Ram Charan Teja, Manchu Manoj Kumar, Sharwanand, Priya Anand, Srihari, Sandeep Kishan, Siva Balaji, Navdeep and Others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X