»   » కుక్క చుట్టూ కామెడీ (‘ఎక్సప్రెస్ రాజా’ ప్రివ్యూ)

కుక్క చుట్టూ కామెడీ (‘ఎక్సప్రెస్ రాజా’ ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రన్ రానా రన్ చిత్రం హిట్ తో శర్వానంద్ కి క్లాస్ హీరో అనే ముద్ర చెరిగిపోయింది. ఆయన సినిమాలకు సామాన్య ప్రేక్షకులు సైతం ఎదురుచూడటం మొదలెట్టారు. దాంతో తను చేయాల్సిన పాత్రలు ఏమిటో శర్వానంద్ కు సైతం భోధపడినట్లుంది...క్లాస్ కు మాస్ కు దగ్గరయ్యే జోష్ తో కూడిన క్లాస్ టచ్ పాత్రలతో రెడీ అవుతున్నాడు. ఆ ప్యాకేజీలో భాగమే..ఎక్సప్రెస్ రాజా. రన్ రాజా రన్ ని గుర్తు చేస్తూ సాగే టైటిల్ నే కాదు, ప్రోమోలు కూడా అదే విధంగా ఫన్ తో కట్ చేసి క్రేజ్ క్రియేట్ చేసుకుని ఈ రోజు ధియోటర్స్ లో దిగుతున్నాడు.

కిడ్నాప్ డ్రామాతో మొదలయ్యే ఈ సినిమా స్క్రీన్ ప్లే బేసెడ్ గా సాగుతుంది. 75 కోట్ల విలువైన డైమండ్ ని ఓ కుక్క మెడకు కట్టి మిస్సవటం చుట్టూ తిరుగుతుంది. హీరో,హీరోయిన్ తో సహా అందరూ ఆ కుక్క కోసం వెతుకుతూంటారు. ఆ కుక్కని పట్టుకునే జర్నీలో జరిగే కామెడీనే చిత్రం.


శర్వానంద్‌ చెబుతూ ....‘‘ఈ సినిమాలో ప్రతి పాత్రా కీలకమే. వినోదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. యూవీ క్రియేషన్స్‌ నా సొంత సంస్థ లాంటిది. మేమంతా కలసి చేసిన ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.


Sharwanand's Express Raja preview

దర్సకుడు మాట్లాడుతూ...‘‘శర్వానంద్‌తో సినిమా అంటే బెంజ్‌ కారులో ప్రయాణం చేయడమే. అంత హాయిగా ఉంటుంది. ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడు ఈ సినిమాని ప్రేమించి పనిచేశారు.. అందుకే ఓ మంచి సినిమాని అందివ్వగలుగుతున్నామ''అన్నారు దర్శకుడు.


బ్యానర్:యూవీ క్రియేషన్స్‌
నటీనటులు: శర్వానంద్‌, సురభి, ఊర్వ హరీష్‌ ఉత్తమన్‌, పోసాని కృష్ణ మురళి, సూర్య, నాగినీడు బ్రహ్మాజి, సుప్రీత్‌, సప్తగిరి, ప్రభాస్‌ను, షకలకశంకర్‌, ధనరాజ్‌ తదితరులు
సంగీతం:ప్రవీణ్‌ లక్కరాజు,
సినిమాటోగ్రఫి:కార్తిక్‌ గట్టమనేని,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌.ఎన్‌,
ఎడిటర్ :సత్య.జి,
ప్రొడక్షన్‌ డిజైనర్‌:ఎస్‌.రవిందర్‌,
లిరిక్స్‌: భాస్కరభట్ల, శ్రీమణి, శ్రీ జో,
డ్యాన్స్‌: రాజు సుందరం, విశ్వ, రఘు,
చీఫ్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : తోట ఫైట్స్‌: స్టంట్‌ జాషువా,
ప్రొడక్షన్‌ కంట్రోలర్స్‌:ఎమ్‌.కష్ణం రాజు (గోపి), మత్తపాటి షణ్ముఖ రావ్‌,
పి.ఆర్‌.ఒ: ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను,
పబ్లిసిటి డిజైనర్‌ : వర్కింగ్‌ టైటిల్‌ (శివకిరణ్‌).
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, డైరెక్షన్‌:మేర్లపాక గాంధి
విడుదల తేదీ: 14-01-206.

English summary
Sharwanand who scored back to back hits with the films ‘Run Raja Run’ and ‘Malli Malli Idhi Raani Roju’ is back with a new film “Express Raja”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu