»   » అదిరింది: శర్వానంద్ 'ఎక్స్ ప్రెస్ రాజా' టీజర్ (వీడియో)

అదిరింది: శర్వానంద్ 'ఎక్స్ ప్రెస్ రాజా' టీజర్ (వీడియో)

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :‘ర‌న్ రాజా ర‌న్' చిత్రం త‌రువాత యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో శ‌ర్వానంద్ న‌టిస్తున్న చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజా. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి వినూత్న‌మైన కాన్సెప్ట్ తో మెద‌టి చిత్రాన్ని సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చేసిన యంగ్ టాలెంటెడ్ డైర‌క్ట‌ర్‌ మేర్ల‌పాక గాంధి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సుర‌భి హీరోయిన్. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

'రన్ రాజా రన్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' లాంటి వరుస సూపర్ హిట్స్ తరువాత చిన్న బ్రేక్ తీసుకున్న శర్వానంద్, మరో ఆసక్తికరమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సినిమా సెలక్షన్ లో ఎప్పుడు కొత్త దనం చూపించే శర్వానంద్ మరోసారి అదే తరహా కథా కథనాలను ఎంచుకున్నాడు.

నిర్మాత‌లు మాట్లాడుతూ.. ర‌న్ రాజా ర‌న్ చిత్రం త‌రువాత మా బ్యాన‌ర్ యు.వి.క్రియోష‌న్స్ లో శ‌ర్వానంద్ హీరోగా చిత్రం చేస్తున్నాం. దానికి ఎక్స్‌ప్రెస్ రాజా అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం తో ద‌ర్శ‌కుడిగా సూప‌ర్‌స‌క్సెస్ ని సాధించిన ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధి ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు.

express1

గాంధి చెప్పిన క‌థ‌, క‌థ‌నం విన్న వెంట‌నే న‌చ్చాయి. మాబ్యాన‌ర్ నుండి చిత్రం వ‌స్తుందంటే ప్రేక్ష‌కుల‌కి ఎన్నో అంచ‌నాలు పెట్టుకుంటారు. వారి అంచ‌నాలు అందుకునేలా ద‌ర్శ‌కుడు గాంధి సూప‌ర్ స్టోరి ని నేరేట్ చేశాడు. చెప్పిన విధంగానే తెర‌కెక్కించాడు' అని తెలిపారు.

'ఎక్స్ ప్రెస్ రాజా' అన్న టైటిల్ వెనుక కూడా ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అందుకే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ నుంచి ఎక్స్ ప్రెస్ ను రన్ రాజా రన్ నుంచి రాజాను తీసుకొని ఈ సినిమాకు ఎక్స్ ప్రెస్ రాజా అనే టైటిల్ ను ఫైనల్ చేశారు.

express2

ఈ చిత్రంలో శ‌ర్వానంద్‌,సుర‌భి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ఉర్వ‌శి, ప్ర‌భాస్ శీను, సుప్రీత్‌, స‌ప్త‌గిరి, ష‌క‌ల‌క శంక‌ర్‌, దువ్వాసి, బండ ర‌ఘు, నాగినీడు, సుర్య త‌దిత‌రులు న‌టించారు. కెమెరా-కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని, సంగీతం-ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, ఆర్ట్‌- ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌- స‌త్య‌.జి, డాన్స్‌- రాజుసుంద‌రం, రఘు, స్టంట్స్‌-ఎ.జాషువా, కాస్ట్యూమ్స్‌-తోట భాస్క‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, నిర్మాత‌లు- వంశి, ప్ర‌మెద్‌, ద‌ర్శ‌క‌త్వం- మేర్ల‌పాకగాంధి.

English summary
Express Raja Teaser on UV Creations, Telugu Movie features Sharwanand, Surabhi, Harish Uttaman, Oorvasi, Prabhas sreenu, Supreeth, Sapthagiri and Shakalaka Shanker in lead roles. Directed by Merlapeka Gandhi, music composed by Praveen Lakkaraju and Produced by Vamsi and Pramod.
Please Wait while comments are loading...