»   » శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా' డబ్‌స్మాష్ పోటీ

శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా' డబ్‌స్మాష్ పోటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శర్వానంద్‌, సురభి జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా'. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం టీమ్ ప్రమేషన్స్ వేగం పెంచింది. అందులో భాగంగా ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ గా మారిన డబ్‌స్మాష్ పోటిని నిర్వహిస్తోంది. ఈ మేరకు నిర్మాణ సంస్ధవారు ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఆ ట్వీట్ మీరూ చూసి కంటెస్ట్ లో పాల్గొని గెలిచి టిక్కెట్లు పొందండి

''వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. బ్రహ్మాజీ ద్వారా శర్వానంద్‌ని కలిసి కథ చెప్పాను. శర్వానంద్‌ను డైరెక్ట్‌ చేయడమంటే బెంజ్‌కారును డ్రైవ్‌ చేయడం లాంటిది. చాలాస్మూత్‌గా, కూల్‌గా ఉంటారు. యు.వి.క్రియేషన్‌ వంటి మంచి బ్యానర్‌లో పనిచేయడం ఆనందంగా ఉంది' అని దర్శకుడు తెలిపారు.

 Sharwanand's Express RajaDubsmash contest!

శర్వానంద్‌ మాట్లాడుతూ, 'ఈ సినిమాకు కథే హీరో. సినిమాలో ప్రతి పాత్ర కీలకమైనదే. యు.వి.క్రియేషన్‌ నా సొంత సంస్థ లాంటిది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను' అని చెప్పారు.

దిల్‌రాజు మాట్లాడుతూ, 'ఈ చిత్ర నిర్మాతలు గొప్ప సినిమాలను నిర్మిస్తున్నారు. యు.వి.క్రియేషన్‌ అంటే ప్రభాస్‌కిది బినామీ లాంటిది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుంది' అని తెలిపారు.

English summary
ExpressRajaDubsmash is the hashtag, use this tag and win the first day movie tickets. Post your dubsmash videos with the hashtag in twitter.
Please Wait while comments are loading...