»   » శర్వానంద్ నెక్ట్స్ ఈ నెల 17న లాంచ్

శర్వానంద్ నెక్ట్స్ ఈ నెల 17న లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘రన్ రాజా రన్' చిత్రం హిట్ తో మళ్లీ తనేంటో ప్రూవ్ చేసుకున్న శర్వానంద్..తర్వాత వచ్చిన మళ్లీ మళ్ళీ ఇది రాని రోజు కూడా హిట్టవటంతో ఉషారుగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయన తన తదుపరి చిత్రం కోసం సిద్దపడుతున్నారు. ఈ చిత్రాన్ని వెంకటాద్రి ఎక్సప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ డైరక్ట్ చేయనున్నారు. ఈనెల 17న సినిమాను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ప్రభాస్ తో ‘మిర్చి', శర్వానంద్ తో ‘రన్ రాజా రన్', గోపిచంద్ తో ‘జిల్' చిత్రాలు తీసి విజయం సాధించిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కొంతకాలం ముందే ఈ సినిమా మొదలు కావాల్సి ఉన్నా, జిల్ చిత్రం పూర్తయ్యే వరకూ కొత్త చిత్రాలేవీ ప్రారంభించే ఆలోచనలో ఆ సంస్థ లేకపోవటంతో ఆపారు. ఇక ఇప్పుడు ‘జిల్' సినిమా విడుదలై , మంచి టాక్‌తో హిట్ దిశగా ముందుకు వెళ్తూండటంతో ఈ కొత్త సినిమాను ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Sharwanand’s next to be launched soon

రన్‌ రాజా రన్‌'తో తన కెరీర్‌లో తొలి కమర్షియల్‌ విజయం అందుకొన్నాడు శర్వానంద్‌. ఇకపై కూడా పూర్తిస్థాయి వాణిజ్య చిత్రాల్లో నటించాలని ఫిక్స్‌ అయ్యాడట. ఇప్పుడు ఆ తరహా కథలనే ఎంచుకోవాలని నిర్ణయించుకొన్నాడట. ఇందులో భాగంగా మేర్లపాక మురళి కథకి ఓకే చెప్పాడటని సమాచారం. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాడు గాంధీ. ఆ తరవాత గాంధీ ఓకే చేసిన ప్రాజెక్టు ఇదే. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.

మరో ప్రక్క వరుణ్ తేజ, శర్వానంద్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. దిల్ రాజు,పొట్లూరి వరప్రసాద్ నిర్మాతగ రూపొందనున్న ఈ చిత్రానికి ఓ మై ఫ్రెండ్ ఫేమ్...వేణు శ్రీరామ్ డైరక్ట్ చేయనున్నారు. ఇంతకీ ఈ చిత్రం ఏమిటీ అంటారా... 'బెంగళూర్‌ డేస్‌' చిత్రం రీమేక్. మలయాళంలో అంజలిమీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్కడ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డును సష్టించింది.

మలయాళంలో విజయం సాధించిన చిత్రం 'బెంగళూర్‌ డేస్‌'. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. తెలుగులో వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తారు. తమిళంలో బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

గత కొంతకాలంగా ఈ రీమేక్‌లో ఎవరు నటిస్తారు? అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నటీనటుల కోసం అన్వేషణ సాగుతోంది. ఈ ప్రయత్నం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగులో వరుణ్‌తేజ్‌, శర్వానంద్‌లు కథానాయకులుగా నటించే అవకాశం ఉంది.

నిత్య మేనన్‌ను హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం. తమిళంలో రానా, ఆర్య, శ్రీదివ్యలు ప్రధాన పాత్రలు పోషిస్తారని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెప్పుకొంటున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

తెలుగు, తమిళ భాషలలో రీమేక్ కానున్న ‘బెంగళూరు డేస్' సినిమాలో హీరో హీరోయిన్లుగా ఒకప్పటి ప్రేమజంట సిద్దార్ధ్, సమంత నటిస్తారని మొదట ప్రచారం జరిగింది. బ్రేక్ అప్ అయిన తర్వాత వీరిద్దరూ ఆ సినిమాలో నటించడం లేదని సోషల్ మీడియాలో ప్రకటించారు. దాంతో, హీరో హీరోయిన్ల ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది.

ఈ సినిమాలో హీరోగా నటించడానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. శర్వాకు తెలుగు, తమిళ భాషలలో మంచి గుర్తింపు ఉండడంతో దర్శకనిర్మాతలు అతన్ని సంప్రదించారు అని సమాచారం. రీసెంట్ గా విడుదలైన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', శర్వానంద్ కు మంచి విజయం అందించింది.

English summary
Sharwanand’s next film will be in the direction of Merlapaka Gandhi, the young filmmaker who made a successful debut with the superhit ‘Venkatadri Express’. The film will be launched on 17th April and UV Creations will be producing this out and out entertainer.
Please Wait while comments are loading...