»   » శర్వానంద్ పేరు "రాధ" అట, ఫస్ట్ లుక్ అదుర్స్

శర్వానంద్ పేరు "రాధ" అట, ఫస్ట్ లుక్ అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్, తన తదుపరి సినిమా ని సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "రాధ" అనే టైటిల్ ను ఖరారు చేస్తూ, శివరాత్రి సందర్భం గా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

విన్నూత్నమైన కథల తో, మంచి నటన తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న శర్వానంద్, ఇంతకుముందు ఎన్నడూ చేయని ఒక వినోదభరితమైన పోలీస్ పాత్రలో ఈ చిత్రం లో కనిపిస్తాడు. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. వేసవి సెలవుల్లో, ఉగాది (మార్చ్ 29) రోజున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. శర్వ సరసన లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా కనిపించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు చంద్రమోహన్ పని చేస్తున్నారు. అయన గతం లో కరుణాకరన్ వద్ద పని చేసిన టెక్నీషియన్.

Sharwanand's Radha first look poster is out

సమర్పకులు బి వి ఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ, " పూర్తి వినోదాత్మకం గా ఈ చిత్రం ఉంటుంది. నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ బాగుంది. రొమాన్స్, కామెడీ , ఏక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా కి రాధ అనే టైటిల్ చక్కగా సరిపోతుంది. ఉగాది రోజున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం ", అని అన్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత భోగవల్లి బాపినీడు.

English summary
1st look of Sharwanand's 26th film #Radha is intriguing. Lavanya is the heroine. The producer is planning for Ugadi release
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu