»   » శశి కపూర్‌కు ప్రతిష్టాత్మక ‘దాదా ఫాల్కే అవార్డు’

శశి కపూర్‌కు ప్రతిష్టాత్మక ‘దాదా ఫాల్కే అవార్డు’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిన్నటితరం ప్రముఖ బాలీవుడ్ నటుడు శశి కపూర్‌ను ప్రతిష్టాత్మక దాదా ఫాల్కే అవార్డు వరించింది. సినిమా రంగంలోని ప్రముఖులకు భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం ఇది. శశి కపూర్ ఇటీవలే 77వ పుట్టినరోజు జరుపుకున్నారు. శశి కపూర్‌కు ఈ అవార్డు దక్కడంపై ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.

Shashi Kapoor chosen for the prestigious Dada Saheb Phalke Award

కపూర్ దాదాపు 160 చిత్రాల్లో నటించారు. మూడు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 2010లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్ హిట్ చిత్రాలైన ‘దీవార్', ‘సిల్ సిలా', ‘సత్యం శివం సుందరం' లాంటి చిత్రాల్లో నటించారు. యనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య జెన్నిఫర్ కెండాల్ కొంతకాలం క్రితమే మరణించింది.

English summary
Yesteryear's heart-throb Shashi Kapoor will be conferred the prestigious Dada Saheb Phalke award for his contribution to Indian cinema. The veteran actor, who celebrated his 77th birthday recently, was wished 'long life' by several actors including Rishi Kapoor and Shabana Azmi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu