»   » 'ఆరెంజ్' ఫలితం ప్రభావం నాపై ఖచ్చితంగా ఉంటుంది

'ఆరెంజ్' ఫలితం ప్రభావం నాపై ఖచ్చితంగా ఉంటుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆరెంజ్" చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన షాజన్ పదంసీ తాను ఇంకా నమ్మకం పోగొట్టుకోలేదని అంటోంది. అలాగే తన ఫెయిల్యూర్ కి కారణాలుని వెతుక్కుంటోంది. రీసెంట్ గా ఆమెను మీడియావారు మీరు ఆరెంజ్ చిత్రం ఎందుకు ఒప్పుకున్నారు అంటే.. అందరికి మంచి చిత్రాలు వస్తే చేయాలనే ఉంటుంది.అయినా. ఫలానాది మంచి చిత్రమని,కాదని ఎలా చెప్పగలం? అది ముందు తెలియదు కదా అంటోంది. అయినా నేను బాధ పడలేదు. నాకు సరైన సమయం ఇంకా రాలేదనే ఎదురుచూస్తున్నా. పరిశ్రమలో ఆరెంజ్ చిత్రం ద్వారా కాలు పెట్టాను కనుక, దాని ఫలితం నాపై తప్పక ఉంటుంది.అలాగే నా సమయం వచ్చినప్పుడు, నాకు తగ్గ పాత్రలు వాటంతటవే వస్తాయి. అయితే అప్పటిదాకా పరిశ్రమ నన్ను మరచిపోకుండా చేసుకోవడమే నా ముందున్న పెద్ద సవాల్ అంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu