»   » రామ్ చరణ్ తేజ్ తో రోమాన్స్ గురించి షాజన్ పదాంసి

రామ్ చరణ్ తేజ్ తో రోమాన్స్ గురించి షాజన్ పదాంసి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో రామ్ చరణ్ తేజాతో రోమాన్స్ గురించి ఆరంజ్ సినిమా నటి షాజన్ పదాంసీ మాట్లాడుతోంది. ఆరంజ్ లో తన పాత్ర గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ తేజాను ప్రశంసలతో ముంచెత్తుతోంది. ఈ టీవీ చానెల్ లో ఆమె ఆరంజ్ లో తన రోల్ గురించి వివరంగా మాట్లాడింది. జెనీలియాతో తన పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో తన పాత్ర వస్తుందని ఆమె చెప్పింది. రామ్ చరణ్ కు పని పట్ల అంకిత భావం ఉందని ప్రశంసించింది. తనను ఎంతో మర్యాదగా చూసేవాడని, తెలుగు అర్థం చేసుకోవడానికి తనకు సహకరించేవాడని, రామ్ చరణ్ తో కలిసి పూర్తి స్థాయి పాత్రలో నటించాలని తనకు కోరికగా ఉందని ఆ అమ్మడు చెబుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu