»   » రామ్ చరణ్ ఒక్క ఆరెంజ్ అయితే హీరోయిన్ కి రెండు ఆరెంజ్ లు...

రామ్ చరణ్ ఒక్క ఆరెంజ్ అయితే హీరోయిన్ కి రెండు ఆరెంజ్ లు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆరెంజ్ చిత్రంలో జెనీలియా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంటే షాజాన్ పదామ్సీ సెకండ్ ఫీమేల్ లీడ్ రోలో చేస్తోంది. ఈ ఆడియోలో సూపర్ హిట్ అయిన 'రూబా రూబా" పాట ఆమెపైనే చిత్రీకరించారట. ఆరెంజ్ చిత్రంతో తెలుగువారికి రూబాగా పరిచయం అవుతోన్న షాజాన్ పదామ్సీ అటు తమిళనాడులోనూ త్వరలోనే అడుగు పెడుతోంది.

'కనిమోని" అనే చిత్రంలో జైకి సరసన షాజాన్ నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 26న విడుదలకి సిద్దమవుతోంది. అదే రోజున ఆరెంజ్ కూడా రిలీజ్ కి రెడీ అవడంతో షాజాన్ ఆనందం పట్టలేకపోతోంది. ఇటు తెలుగు, అటు తమిళంలో ఒకే రోజున వెండితెరపై మెరవనున్న షాజాన్ 'ఆరెంజ్" తో ఓ రేంజ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటానని అంటోంది. హిందీలో రాకెట్ సింగ్ తో ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటరైన షాజాన్ పదామ్సీ ఆ చిత్రం ప్లాపయినా కానీ పలువురి దష్టిని ఆకట్టుకుంది. హిందీలో ప్లాప్ అయిన హీరోయిన్లు చాలా మంది సౌత్ ని రూల్ చేశారు కాబట్టి షాజాన్ కూడా వారి బాటలోనే నడుస్తుందేమో చూడాల్సిందే.

Please Wait while comments are loading...