»   » రామ్ చరణ్ రికమండేషన్ తో 'మెరుపు' లో ఆఫర్ పట్టేసింది

రామ్ చరణ్ రికమండేషన్ తో 'మెరుపు' లో ఆఫర్ పట్టేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఆరెంజ్" చిత్రంలో చేసిన షాజన్ పదంసీ..రామ్ చరణ్ కి నచ్చేసిందనీ, ఆమెతో ముంబై వెళ్ళి డేటింగ్ చేసి వచ్చాడంటూ వార్తలు వినపడ్డాయి. ఇవి నిజమేనా అన్నట్లు రామ్ చరణ్ తన తాజా చిత్రం మెరుపులో ఆమెను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాజల్ తను డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని తప్పుకోవటంతో షూటింగ్ ఆపుచేసుకు కూర్చున్న చరణ్ మరో వారంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తున్నాడు. దర్శకుడు ధరణి సూచన మేరకు ఇలియానాను హీరోయిన్ గా తీసుకుందామనుకున్నా చివరి నిముషంలో షాజన్ పదంసీ బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ గ్యాప్ లో చిత్రం స్క్రిప్టులో కూడా మేజర్ గా మార్పులు చేసారని, ఇప్పుడు స్టోరీపై పూర్తి స్ధాయి నమ్మకం వచ్చే మొదలెడుతున్నారని చెప్తున్నారు. ఆరెంజ్ చిత్రం స్క్రిప్టు ఫెయిల్యూర్ తో ఫ్లాఫ్ కావటంతో ఈ రకంగా చరణ్ మొదట పూర్తి స్ధాయి స్క్రిప్టు రెడీ అయ్యాకే సినిమాలోకి దూకాలనుకుంటున్నాడు. షాజన్ హిందీలో 'దిల్‌తో బచ్చా హై జీ" అనే చిత్రంలో నటించింది. అజయ్ దేవగన్ హీరోగా మధూర్ బండార్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కాబోతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu