»   » మళయాళ మేకప్ మేన్ తో షీలా బిజీ

మళయాళ మేకప్ మేన్ తో షీలా బిజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

అదుర్స్, మస్కా చిత్రాలతో గ్లామర్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్న షీలా తాజాగా మళయాళంలో మేకప్ మేన్ అనే చిత్రంలో నటిస్తోంది. నిజ జీవిత పాత్ర అయిన హీరోయిన్ గానే ఈ చిత్రంలోనూ కనిపించనుంది. సినీ పరిశ్రమ నేఫద్యంలో నడిచే ఈ కథలో మళయాళ హీరో జయరామ్ నటిస్తున్నారు. ఎంబిఎ చదివి హీరోయిన్స్ కి మేకప్ చేస్తూ వారితో అనుబంధం పెంచుకునే పాత్రలో కనిపిస్తాడు. అతనికి షీలా మద్య వచ్చే సన్నివేశాలు ఫన్ తో అలరిస్తాయని చెప్తున్నారు. అలాగే మరో హీరోయిన్ లక్ష్మీ రాయ్ కూడా ఓ కీలకపాత్రను పోషిస్తోంది. షఫీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్రివేండ్రమ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. దాదాపు ఇరవై ఐదు రోజులు పాటు షూటింగ్ జరుపుకుని ఆ తర్వాత మలేషియాకు షిప్ట్ అవుతుందని తెలుస్తోంది. సచి, సేతు స్క్రిప్టు అందించిన ఈ చిత్రాన్ని రంజిత్...తమ రాజపుత్ర బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక షీలా తెలుగులో అదుర్స్ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఒక్క ఆఫరూ రాలేదు. మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu