»   » మంచి అవకాశం మిస్సయ్యాను: షీలా

మంచి అవకాశం మిస్సయ్యాను: షీలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

భరత్‌, సంధ్య చేసిన 'ప్రేమిస్తే' చిత్రంలో మొదట నన్ను అడిగారు. అప్పుడు నేను నైన్త్‌ చదువుతున్నాను. కనీసం టెన్త్‌ అయినా పూర్తి చేయకుండా సినిమాల్లో చేయడం కరెక్ట్‌ కాదని ఆ సినిమా చేయలేదు. ఆ టైమ్‌లో అమ్మక్కూడా నేను సినిమాల్లో చేయడం ఇష్టం లేదు. అలా బంగారం లాంటి అవకాశం చేజారిపోయింది' అంటూ గత అనుభవాలను నెమరు వేసుకుంది షీలా. అయితే సరైన పాత్ర వస్తే... ప్రూవ్‌ చేసుకోవడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నానంటోంది షీలా.

అలాగే తాను మోడ్రన్ పాత్రలంటే ఆసక్తి చూపుతానంటూ... "నాకు మోడ్రన్‌గా ఉండటం ఇష్టం. కానీ కెరీర్‌ ప్రారంభంలో అన్నీ లంగా ఓణీ పాత్రలే వచ్చాయి.దాంతో అలా చేయక తప్పలేదు. 'మస్కా' లో ఓ గ్లామర్‌ పాత్ర ఉంది చేస్తావా?.. అని ఎమ్మెస్‌ రాజుగారు అడిగినప్పుడు ఎగిరి గంతేశాను. ఆ సినిమా ద్వారా నా సత్తా ఏంటో తెలియజేశాను. ఇక 'అదుర్స్‌' గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు' అంటూ చెప్పుకొచ్చారు షీలా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu