»   » ఎన్టీఆర్, వినాయక్ ల కోసమే 'అదుర్స్' చేసాను: షీలా

ఎన్టీఆర్, వినాయక్ ల కోసమే 'అదుర్స్' చేసాను: షీలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొదట తను నటించిన సీతాకోక చిలుక, పరుగు లాంటి సినిమాల్లో హోమ్లీగా కనిపంచిన షీలా ఆ తర్వాత రూటు మార్చి మస్కా సినిమాతో గ్లామర్ బాటను పట్టింది. ఈ సినిమాలో ధారాళంగా అందాలు ఆరబోయడంతో వెంటనే ఎన్టీఆర్ వంటి అగ్రనాయకుడితో నటించే అకాశం లభించింది. అది కూడా వివి వినాయక్ దర్శకత్వంలో...దీంతో ఆమె కెరీర్ గ్రాఫ్ అమాంతం ఎవరెస్టు శిఖరంలా ఎగబాకింది. ఈ విషయమై షీల స్పందన ఇలా వుంది..

అసలు అదుర్స్ సినిమాలో నటించడానికి ముందు కథ విన్నప్పుడు నటించడానికి పెద్దగా స్కోప్ లేకపోయినా ఎన్టీఆర్ వంటి అగ్రనాయకుడితో, అదీ వివి వినాయక్ వంటి దర్శకుడితో అనే సరికి ఒప్పుకున్నాను. తీరా ఫొటో షూట్ జరిగి, ఫొటోలు విడుదల కాగానే అనూహ్య స్పందన లభించింది. అందరూ షీలా చాలా అందంగా వుంది అంటూ కమెంట్ చేసారు. దీంతో ఇంకా సినిమా విడుదల కాకముందే అవకాశాలు రావడం మొదలెట్టాయి. ఏకంగా తొమ్మిది సినిమాలు నా తలుపుతట్టాయి. ఇక సినిమా విడుదలయ్యాకా ఈ సంఖ్య మరింత పెరిగింది అని రెండు కళ్లూ పెద్దవి చేసి చెప్పింది ఈ భామ.

మరి ఎన్టీఆర్ తో నటించడం ఎలా వుంది అని అడగ్గా "అతనితో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో డాన్స్ చెయ్యడానికి తొలుత ఇబ్బంది పడ్డా తర్వాత ఎన్టీఆర్ సహకారంతో ఏదోలా కానిచ్చేసాను. కానీ అతనితో డాన్స్ అంటే చాలా కష్టం అని చెప్పుకొచ్చింది". మరి నయనతారను కాంపిటీటర్ గా అనుకున్నారా అన్న ప్రశ్నకు అసలు నయనతార నా కంటే చాలా సీనియర్ ఆమెతో నేను పోటీపడేంత అనుభవం నాకు లేదని ఆమెతో పనిచేయడం మంచి అనుభవం అని వినయంగా చెప్పి బుద్ధిమంతురాలు అనిపించుకుంది షీలా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu