twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సినిమా నా దత్త పుత్రిక:శేఖర్ కమ్ముల

    By Srikanya
    |

    Shekar Kammula
    హైదరాబాద్: ''నేను నా సినిమాల్ని నా బిడ్డలతో పోలుస్తాను. ఈ సినిమాని నా దత్తపుత్రికగా భావిస్తున్నాను. కారణం ఈ సినిమా హిందీ సినిమా 'కహానీ'ని దత్తత చేసుకొని తెరకెక్కించాం. నేను కూడా ఇలాంటి కథనే రాసుకుందామనుకుంటుండగా ఈ కథ నా దగ్గరికొచ్చింది. ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉండటంతో ఒప్పుకున్నాను'' అన్నారు శేఖర్‌ కమ్ముల. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'అనామిక' చిత్రం ట్రైలర్ లాంఛింగ్ సందర్భంగా పై విధంగా స్పందించారాయన. ఐడెంటిటీ మోషన్ పిక్చర్ అండ్ మూవింగ్ పిక్చర్స్‌తో కలిసి బాలీవుడ్‌కు చెందిన వయాకామ్18 మోషన్ పిక్చర్ సంస్థ నిర్మించిన చిత్రం 'అనామిక'.

    శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... ''ప్రస్తుత వ్యవస్థలోని లోపాల్ని ఎదిరించే ఓ మహిళ కథ ఈ 'అనామిక'. తన భర్తని వెతుక్కుంటూ వెళ్లిన అనామికకి ఈ సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది తెరపైనే చూడాలి. ఈ కథలో మార్పులు చేయడంలో యండమూరి వీరేంద్రనాథ్‌గారు, నేను చాలా కష్టపడ్డాం. మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకున్నాం. సినిమా ఎక్కువ భాగం పాతబస్తీ నేపథ్యంలో జరుగుతుంది. కథకి తగ్గట్టుగా ఉందనే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాం. దీంతోపాటు ఆ ప్రాంతంలో ఎన్నో అపురూపమైన కట్టడాలు, అందాలు ఉన్నాయి. వాటిని చూపిస్తున్నాం''అన్నారు.

    అలాగే..."హైదరాబాద్‌లోని పాతబస్తీ నేపథ్యంలో కథ సాగుతుంది. 'కహానీ'లోని పాత్ర కంటే 'అనామిక' క్యారెక్టర్ చేయడమే కష్టం. ఆ పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది. 60 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. తెలుగు, తమిళంలో చేస్తున్న సినిమా ఇది. దాంతో పాటు తొలిసారి స్టార్ హీరోయిన్‌ను డైరెక్ట్ చేశాను. సీతారామశాస్త్రి, యండమూరి, కీరవాణి వంటి పెద్ద టెక్నీషియన్స్‌తో పనిచేశాను. ముఖ్యంగా నా రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన జానర్‌లో చేసిన ప్రయత్నం ఇది.. అందుకే కాస్త ఎగ్జయిటింగ్‌గా ఉంది. నిజానికి ఇది బాలీవుడ్ మూవీ 'కహానీ' నుంచి అడాప్ట్ చేసుకున్న కథ అనాలి. ఎందుకంటే స్క్రిప్టులో చాలా మార్పులు చేశాం. యండమూరి వీరేంద్రనాథ్ రీరైట్ చేశారు. టైటిల్ కూడా ఆయన సూచించిందే''అన్నారు.

    ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి కారణాన్ని చెబుతూ,'వయాకామ్ వాళ్లు నన్ను వెతుక్కుంటూ వచ్చి సినిమా తీయమని అడిగారు. నాకది బాగా నచ్చింది. ప్రొడ్యూసర్స్ దర్శకులను వెతుక్కుంటూ రావడమనే ట్రెండ్ చాలా మంచిది. ఈ సినిమా చేయడానికి అది కూడా ఒక కారణం' అన్నారు. త్వరలోనే భారీ స్థాయిలో ఆడియో విడుదల చేస్తున్నామనీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలయ్యే ఈ సినిమా రిలీజ్ డేట్ నిర్ణయం కాలేదని తెలిపారాయన. నయనతార, వైభవ్, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    English summary
    
 Viacom18 Motion Pictures has kick started their promotions for new movie Anamika with unique concept . The maiden venture starring Nayanthara, Vaibhav, Harshavardhan Rane and Pasupathi in lead roles is directed by Sekhar Kammula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X