twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్‌ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కాన్సెప్టు

    By Srikanya
    |

    ఆనంద్,గోదావరి,హ్యాపీడేస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఈ చిత్రం కాన్సెప్టు గురించి శేఖర్ కమ్ముల చెపుతూ...కాలంతోపాటుగా పరిగెడుతున్నాం. చిన్ననాటి జీవితాన్నీ, అప్పటి ఆనందాల్నీ, అనుభూతుల్నీ గుర్తుకు తెచ్చుకొనే తీరిక కూడా లేనంత వేగంగా ముందుకు సాగుతున్నాం. కానీ ఆ రోజులు ఇప్పుడోసారి మన ముందుకొస్తే ఎలా ఉంటుంది? అమ్మ చేతి గోరుముద్దలు దగ్గర్నుంచి మొదలుపెడితే... టీచర్‌ కొట్టిన దెబ్బలు, కాగితపు పడవలు, గల్లీలో క్రికెట్‌ ఆడుకొన్న రోజులు, వెన్నెల రాత్రిలో డాబా మీద పడక, ఆ పక్క నుంచి వినిపించే ఘంటసాల పాట... ఆహా ఎన్నెన్ని అనుభూతులో కదూ. మా చిత్రంతో వాటన్నింటినీ ఓసారి గుర్తుకు తెస్తామంటున్నారు శేఖర్‌ కమ్ముల.

    అలాగే ఈ చిత్రం చేయటానికి ఇంత గ్యాప్ రావటానికి కారణం చెపుతూ.. ''కొంచెం అమాయకత్వం, మరికొంచెం గందరగోళం, ఆహ్లాదం, అనుభూతులు... ఇలా అన్నీ మిళితమైన కథాంశమిది. నా గత చిత్రం 'లీడర్‌'ని అమాయకత్వంతో తీశాను. సమాజంలో మార్పు వస్తుందనీ, అందరూ మారాలనే ఆవేశపూరితమైన ఆలోచనతో తెరకెక్కించాను. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. నాదైన శైలిలో రావాలని నిర్ణయించుకొన్నాను. అందుకే ఇంత సమయం పట్టింది. కళాశాల నేపథ్యంలో 'హ్యాపీడేస్‌' సాగుతుంది. ఇది మాత్రం వీధిలో హ్యాపీడేస్‌లా ఉంటుంది. నటీనటుల ఎంపిక కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది''అన్నారు.

    సరస్వతి సిగ్గుపడే సినిమాలు నేను తీయను. అందరూ మెచ్చే సినిమాలే నా నుంచి వస్తాయి. అందరూ కష్టపడి ఈ సినిమాకు పని చేశారు. హైదరాబాద్‌లోని పద్మారావు నగర్‌లో అన్ని కమ్యూనిటీలూ సెట్ అయ్యే విధంగా ఓ అందమైన కాలనీని నిర్మించాం. వేటూరిగారు లేకపోవడంతో వనమాలి, అనంత శ్రీరామ్ ఇందులో పాటలు రాశారు అని శేఖర్ కమ్ముల తెలిపారు. శేఖర్‌కమ్ముల మిత్రుడు మనోహర్ మాట్లాడుతూ -''శేఖర్ రెండేళ్ల తపస్సు ఈ సినిమా. పిల్లలకు, పెద్దలకు, యువతరానికీ, ఎన్‌ఆర్‌ఐలకు తమ పాతరోజుల్ని గుర్తు చేసే సినిమా ఇది'' అని చెప్పారు.

    'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'చిత్రంలో అభిజిత్‌, సుధాకర్‌, కౌశిక్‌, షగుణ్‌, జారా, రష్మి, కావ్య, నవీన్‌, విజయ్‌ సంజీవ్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రధారులు. చంద్రశేఖర్‌ కమ్ముల, శేఖర్‌ కమ్ముల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బండి రత్నకుమార్‌, కళ: తోట తరణి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, పాటలు: వనమాలి, అనంతశ్రీరామ్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌, సంగీతం: మిక్కీ జె.మేయర్‌.

    English summary
    shekar Kammula is one of the famous directer in tollywood and now he is coming with the all new cast. And his latest movie Life is beautiful movie is gonna release On August 15th on teh occassion of Independence day..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X