‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అదే చెప్తున్నా:శేఖర్ కమ్ముల
అలాగే లైఫ్ సింపుల్‌గా ఉండాలండీ. ఇరుగు పొరుగువారితో మాటలు... సాయంత్రమైతే పిల్లలతో ఆటలు... వాన కురిస్తే కాగితం పడవలు... వెన్నెల రాత్రుళ్లలో పచార్లు... ఇంతకన్నా ఏం కావాలి. నా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' కూడా ఇలా కాలనీ జీవితమే చెప్తుంది. మీకు తెలుసా? భారీ సీన్లు కావాలంటే నేను మా కాలనీ వాళ్లకు చెప్పేస్తాను... రండి అని. మొన్న ఒక విందు సీన్ తీశాం. అందరూ తయారయి వచ్చి చక్కగా భోం చేసుకొని వెళ్లారు. ఎంత బాగుందో కదా అన్నారు.
ఇక తన ఫెయిల్యూర్ సినిమా లీడర్ గురించి మాట్లాడుతూ...'హ్యాపీడేస్' తర్వాత ఏం చేయాలా అనుకుంటుంటూ ఉంటే 'లీడర్' ఆలోచన వచ్చింది. పొలిటికల్ కరప్షన్, పొలిటికల్ కమిట్‌మెంట్, పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ... వీటిని మాట్లాడితే చాలా బాగుంటుందని అనిపించింది. ఆ టైమ్‌కు నాకు వచ్చిన ఆలోచన అది. నేను సేఫ్ ప్లేయర్‌ని అయి ఉంటే మళ్లీ మరో 'హ్యాపీడేస్' లాంటి సినిమా తీసుండేవాణ్ణి. 'లీడర్' ఎందుకు తీస్తాను? నిజానికి ఈ సినిమాను వైయస్ రాజశేఖరరెడ్డి లాంటి సిఎంకు చూపించి ఆయనను కూడా ఇన్‌స్పయిర్ చేసి ఇంకా మంచి పనులు చేయించాలని అనుకున్నాను. బ్యాడ్‌లక్.... సినిమా విడుదలకు ముందే ఆయన చనిపోయారు. సరే.... మిగిలిన వాళ్లయినా దానిని చూసి స్పందిస్తారని, సమాజంలో పెద్ద చైతన్యం వస్తుందని అనుకున్నాను. అంత రెస్పాన్స్ రాలేదు. ప్చ్...అన్నారు.


Click it and Unblock the Notifications












