Just In
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 3 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'అనామిక': శేఖర్ కమ్ములకు విసుగొచ్చే ఆ మాటలు?
హైదరాబాద్: శేఖర్ కమ్ముల నుంచి రాబోతున్న చిత్రం 'అనామిక'. హిందీలో విజయవంతమైన 'కహానీ'కిది రీమేక్. ఈ సినిమా వచ్చే నెల 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...ఇకపై రీమేక్ సినిమాలు చేసే ప్రసక్తే లేదు.
నా వరకు కథను రాసుకొని సినిమా తీయడంలోనే సంతృప్తి ఉంటుంది. ఇలా వేరే భాషలో వచ్చిన సినిమా కథను మార్చి రాసుకోవడంలో కష్టం ఉంది.. సంతృప్తి కూడా లేదు అని తేల్చి చెప్పారు.
ఇలా రిలీజ్ కు ముందు సంతృప్తి లేదనే కామెంట్స్ శేఖర్ కమ్ముల చేయకుండా ఉంటే బాగుండేది అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో శేఖర్ కమ్ముల విసిగిపోయారని అంటున్నారు. నయనతార ప్రవర్తన కూడా ఓ కారణం అయ్యిండవచ్చు అని చెప్తున్నారు. ఆమె ఈ చిత్రం ప్రచారానికి రావటం లేదు. మరో ప్రక్క సినిమా హిట్టైతే ...ఆ ఏముంది రీమేకే అంటారు..అదే తేడా వస్తే...ఆల్రెడీ ఉన్న సినిమాని కూడా ఉన్నదున్నట్లు తీయలేక సొంత పైత్యం జోడించి పాడు చేసారంటారనే భయం కూడా ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

'అనామిక' కథ గురించి ఆయన మాట్లాడుతూ.. కొత్తగా పెళ్లయి అనుకోని కారణాల వల్ల భర్తకు దూరమైన ఓ స్త్రీ కథ ఇది. ఆ భర్తను వెతుక్కుంటూ వెళ్లే మహిళకు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని అధిగమించి ఆ మహిళ ఏం సాధించింది అనేది తెరపై చూడాల్సిందే అన్నారు. అలాగే నేను ముందు నుంచి చెబుతున్నట్లు ఈ సినిమా చేయమని నిర్మాతలే నన్ను వచ్చి అడిగారు. ప్రస్తుతం తెలుగులో నాయికా ప్రాధాన్యమున్న సినిమాలు రావడం అరుదు. ఇలాంటి సమయంలో ఇంత మంచి కథతో నా దగ్గరి వచ్చేసరికి కాదనలేకపోయాను.
ఈ పాత్రకు నయనతారనే ఎంచుకోవడానికి కారణం చెప్తూ... 'అనామిక' పాత్రకు తొలుత అనుష్కను అనుకున్నాం. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు కొత్తవాళ్ల గురించీ ఆలోచించార. కానీ నయనతార అయితే పాత్రకు కచ్చితంగా సరిపోతుందని భావించాం. మరోవైపు ఈ సినిమా తెలుగు, తమిళంలో రూపొందుతుండటం కూడా ఒక కారణం. తమిళంలో స్టార్ హీరోయిన్ అయితే బిజినెస్ నయనతారను ఈ పాత్ర కోసం ఎంచుకున్నాం అన్నారు.
సినిమా ప్రచారంలో నయనతార కనిపించడం లేకపోవటానికి కారణం... కొత్తవాళ్లతోనే సినిమాలు చేయడం వల్లనేమో నాకు ఇప్పటి వరకు సినిమా ప్రచారం విషయంలో ఇబ్బందులు రాలేదు. కానీ ఈ సినిమా మొత్తం నయనతార ప్రధానంగా సాగుతుంది. దీంతో ప్రచారంలో ఆమె కూడా ఉంటే బాగుండు అనిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె రావడం లేదు. వస్తే సినిమాకు మంచిది అన్నారు.