twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'లీడర్' స్టోరీ ఐడియా ఎలా పుట్టిందంటే..శేఖర్ కమ్ముల

    By Srikanya
    |

    రామానాయుడు మనవడు రాణాని హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల లీడర్ చిత్రం రూపొందించారు. ఈ చిత్రం ఆడియో పంక్షన్ ఆదివారం సాయింత్రం హోటల్ మారియట్ లో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..చాలా మంది చెప్పుకుంటూండగా విన్నాను..సురేష్ బాబు, వెంకటేష్ నన్ను పిలిచి ఈ ప్రాజెక్టును డైరక్ట్ చేయమని అప్పచెప్పారని,అయితే అది నిజం కాదు..నేనే రాణాని నా చిత్రానికి హీరోగా ఎంచుకున్నాను. ఇప్పటి వరకూ నేను చిన్న బడ్జెట్ చిత్రాలనే చేస్తూ వచ్చాను. అయితే ఎవియం వారు ఇచ్చిన స్వేచ్చతో ఈ చిత్రం భారీగా నిర్మించాను. ఈ చిత్రం నాకు తల్లి లాంటిది. ఎందుకంటే ఈ చిత్రం చేస్తున్నప్పుడు నన్ను నేను ఓ మంచి సిటిజన్ గా ఓ దర్శకుడుగా రీ డిస్కవర్ చేసుకున్నాను. ఇక ఈ చిత్రం ఐడియా ఎలా వచ్చిందంటే హ్యాపీడేస్ చిత్రం పూర్తి చేసి ఓ ఆరు నెలలు పాటు నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఆలోచనలో ఉండగా జనరల్ ఎలక్షన్స్ ఎనౌన్స్ చేసారు. దాంతో నేను టీవీ చానెల్స్ చూడటం ప్రారంభించాను. దాంతో నాకు పాలిటిక్స్ అనేవి అర్ధం అవటం ప్రారంభించాయి. దాంతో నేను ఈ పొలిటకల్ డ్రామా రాసాను. అన్నారు. అలాగని..ఈ చిత్రంలో ఎక్కడా రక్తపాతం,ఫైట్స్ ఉండవు..ఇదొక పొలిటికల్ ధ్రిల్లర్ మాత్రమే అని వివరించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X