»   » శేఖర్ కమ్ముల 'లీడర్' సినిమా కథాంశం ఏమిటీ?

శేఖర్ కమ్ముల 'లీడర్' సినిమా కథాంశం ఏమిటీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాణాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్' చిత్రం రేపు(శుక్రవారం) రిలీజు అవుతోంది. ఈ చిత్రం కథాంశం గురించి రాణా మాట్లాడుతూ...ఇది ఒక ఫ్యామిలీ పొలిటికల్ ఫిల్మ్. ఒక రాజకీయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావడం ఈజీ. కానీ 'లీడర్'గా మారడం ఈజీ కాదు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు 'లీడర్' గా ఎలా మారాడన్నది ఈ కథ. లీడర్‌లో ఉండాల్సిన లక్షణాలేమిటన్నది చర్చిస్తూ ప్రేక్షకుల్లో చైతన్యం తీసుకొచ్చే థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్. నాయకులంటే స్వాతంత్య్ర సమరయోధుల గురించే ఇప్పటికీ చెప్పుకుంటుంటాం. అలాంటి నాయకులు ఇప్పుడు కావాలి అని ఈ సినిమాతో చెబుతున్నాం అన్నారు.

అలాగే శేఖర్ కమ్ముల గత చిత్రాలైన గోదావరి, ఆనంద్, హ్యాపీడేస్ లకీ, లీడర్ చిత్రానికి తేడా వివరిస్తూ...లీడర్ సినిమా చూస్తే.. ఇది ఆయన మునుపటి సినిమాల తరహాది కాదని తెలుస్తుంది. శేఖర్ నిజాయితీ కలిగిన రచయితగా కథలు రాస్తుంటారు. నాకు తెలిసి 'లీడర్' ఆయన బెస్ట్ ఫిల్మ్. కథ విషయంలోనూ. ఇప్పటివరకు ఆయన ఒక తరహా సినిమాలు తీశారు. వాటికి ఏమాత్రం సంబంధలేకుండా పూర్తి భిన్నమైన తరహాలో 'లీడర్' తీశారు. ఇది అంత ఈజీకాదు. రాజకీయాల గురించీ, సినిమాల గురించీ చాలా నాలెడ్జి ఉన్న వ్యక్తి కాబట్టే ఈ సినిమాని ఆయన బాగా చేయగలిగాడు అంటున్నారు.

ఇక ఎవియం బ్యానర్ వారు నిర్మించిన ఈ చిత్రంలో ముఖ్యమంత్రి ప్రమాదంలో మరణిస్తే...అతని కుమారుడు రాజకీయాల్లోకి రావటం అనే అంశం చుట్టూ తిరుగుతుంది. వారసత్వ రాజకీయాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో ఉదయభాను ఐటం సాంగ్ ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu