twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారే నిజమైన హీరోలు: శేఖర్‌కమ్ముల

    By Srikanya
    |

    హైదరాబాద్ : అమ్మాయిల ఇష్టానికి అనుగుణంగా నడుచుకునే అబ్బాయిలే నిజమైన హీరోలని ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు. ఢిల్లీలో యువతిపై జరిగిన అకృత్యం నేపథ్యంలో బుధవారం పద్మారావునగర్‌లోని ఎస్పీ కళాశాలలో రాణి రుద్రమదేవీ మహిళా సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. శేఖర్‌కమ్ముల ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ అమ్మాయిలు, అబ్బాయిలు దుస్తుల కోణంలో కాకుండా మంచి దృక్పథంతో చూడాలన్నారు.

    ఇష్టంలేని విషయాలను నిర్భయంగా చెప్పటం నేర్చుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఢిల్లీ ఘటనతో ప్రజల్లో చైతన్యం పెరిగిందని, సంఘటన జరిగినప్పుడు ఉత్పన్నమయ్యే ఆవేశం పెరగాలే తప్ప, తగ్గకూడదన్నారు. కార్యక్రమంలో ఆవకాయ బిర్యాని సినిమా హీరో కమల్‌, ఓయూ ఆచార్యుడు ద్వారాకనాథ్‌, ఎస్పీ కళాశాల ఛైర్మన్‌ వసంతరావు, ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ శైలజ రాధాకృష్ణ, న్యాయవాది సుభాషిణి, చందర్‌ మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు శేఖర్‌కమ్ముల బ్యాడ్జీలను అందజేశారు.

    శేఖర్ కమ్ముల ప్రస్తుతం హిందీ రీమేక్ 'కహానీ' ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనూష్కను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు గా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే అనూష్క కి డేట్స్ ఖాళీ లేకపోవటంతో చేతులు ఎత్తేసిందని, ఆ ప్లేస్ లోకి నయనతార వచ్చిందని విశ్వసనీయ సమాచారం.

    నయనతారనుని రీసెంట్ గా శేఖర్ కమ్ముల కలిసి కథ చెప్పటం జరిగిందని, ఆమె తను ఆ చిత్రంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ సమాచారం. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. యండమూరి వీరేంద్రనాధ్ స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్ర కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మార్పులు చేస్తున్నాడు. కనిపించకుండా పోయిన తన భర్తని వెతుక్కుంటూ ఇండియాకొచ్చే యువతిగా ఇందులో అనుష్క నటించనుంది. కొంత సస్పెన్స్‌తో పాటు థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కనున్న ఈ మూవీని ముంబైకి చెందిన టీవీ ప్రొడక్షన్ సంస్థ ఎండిమోల్ ఇండియా-మూవింగ్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నాయి.

    English summary
    Sekhar Kammula encouraging students to protest ongoing atrocities by wearing 'I Care I React' badge
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X