»   » వందేళ్ల తర్వాత కూడా..: శేఖర్ కమ్ముల

వందేళ్ల తర్వాత కూడా..: శేఖర్ కమ్ముల

Posted By:
Subscribe to Filmibeat Telugu

"వందేళ్ల తర్వాత కూడా తమకి కావాల్సిన 'లీడర్‌' పట్ల ప్రజల కలలు అలాగే ఉంటాయి. అంటే కాలానికి నిలిచే కథతో ఈ సినిమాని తీశాం. ధైర్యంగా తీసిన ఈ సినిమా సెన్సార్‌కి వెళ్లేప్పుడు ఏమవుతుందోనని సందేహించా. వారు క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ ఇవ్వడమే కాకుండా, 'ఈ సినిమా చూసి ఇన్‌స్పైర్‌ అవుతున్నాం' అనడం సంతోషంగా అనిపించింది అంటున్నారు శేఖర్ కమ్ముల.రామానాయుడు మనవడు రానా హీరోగా పరిచయమవుతున్న 'లీడర్‌' చిత్రం ఈ నెల 11న రిలీజు అవుతోంది. ఈ సందర్బంగా ఒక ప్రైవేట్‌ హోటల్‌ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

అలాగే ఈ చిత్రం కాన్సెప్టుని శేఖర్ కమ్ముల చెపుతూ...నాయకుడనే వాడు ఎలా ఉండాలి అని 'లీడర్‌'లో చూపించాననీ, సమాజానికి దిశను చూపించే 'లీడర్‌' కావాలని చెప్పాననీ అన్నారు.'లీడర్‌'గా టైటిల్‌ పాత్రలో రానా చాలా బాగా చేశాడు. అతనికి ఇది తొలి సినిమా అంటే నమ్మనంతగా నటించాడు. మిక్కీ సమకూర్చిన సంగీతం, విజయ్‌కుమార్‌ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరింత రిచ్‌ లుక్‌ని తీసుకొచ్చాయి" అని చెప్పారు.ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ మాట్లాడుతూ..తాను పనిచేసిన 225 సినిమాల్లోని అత్యుత్తమ చిత్రాల్లో 'లీడర్‌' ఒకటని అన్నారు.

ఇక ఏవీయం ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందిన ఈ 174వ చిత్రాన్ని ఎం.శరవణన్‌, ఎమ్మెస్‌ గుహన్‌, అరుణా గుహన్‌, అపర్ణా గుహన్‌ కలిసి నిర్మించారు. రిచా గంగోపాధ్యాయ్‌, ప్రియా ఆనంద్‌ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, సుహాసిని, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ఆహుతి ప్రసాద్‌, గొల్లపూడి మారుతీరావు, సుమన్‌, హర్షవర్థన్‌, రావు రమేశ్‌ మిగతా కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu