»   » నా తల్లిని తిట్టాడు, తాగి నా భార్యకు ఫోన్ చేసేవాడు: రాకేష్ మాస్టర్‌కు శేఖర్ మాస్టర్ కౌంటర్!

నా తల్లిని తిట్టాడు, తాగి నా భార్యకు ఫోన్ చేసేవాడు: రాకేష్ మాస్టర్‌కు శేఖర్ మాస్టర్ కౌంటర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్లో సీనియర్ డాన్స్ మాస్టర్లలో ఒకరైన రాకేష్ మాస్టర్ వద్ద శిష్యరికం చేసి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డాన్స్ మాస్టర్లలో ఒకరుగా రాణించడంతో పాటు ఢీ 10 లాంటి డాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్. అయితే ఈ మధ్య తరచూ కొన్ని ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్న రాకేష్ మాస్టర్.... తన శిష్యుడు శేఖర్ మాస్టర్ మీద సంచలన ఆరోపణలు చేయడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

రాకేష్ మాస్టర్ ఆరోపణలపై ఇంతకాలం మౌనంగా ఉన్న శేఖర్ మాస్టర్ మౌనం వీడారు. ఉగాది సందర్భంగా ఫేస్‌బుక్ లైవ్ చాట్లో రాకేష్ మాస్టర్‌తో మీ గొడవ ఏమిటి? అనే ఓ అభిమాని ప్రశ్నకు శేఖర్ మాస్టర్ స్పందిస్తూ అసలు విషయం చెప్పుకొచ్చారు.

నా తల్లిని తిట్టాడు

నా తల్లిని తిట్టాడు

రాకేష్ మాస్టర్ తో నాకు గొడవ ఏమీ లేదు. మా మధ్య ఏం జరిగింది అనేది నాకు, సత్యకు, మాస్టర్ గారికి మాత్రమే తెలుసు. గడ్డం వేణు మాస్టర్ అని ఇంకో మాస్టర్...గొడవ సమయంలో అక్కడ ఉన్న కొందరు స్టూడెంట్స్‌కు మాత్రమే తెలుసు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా తల్లికంటే ఎవరూ గొప్ప కాదు. నా తల్లిని రాకేష్ మాస్టర్ తిట్టడం వల్లే గురువు గారితో మాట్లాడటం మానేసి దూరంగా ఉంటున్నాను..... అని శేఖర్ మాస్టర్ తెలిపారు.

మళ్లీ మళ్లీ రిపీట్ చేశాడు

మళ్లీ మళ్లీ రిపీట్ చేశాడు

ఒకసారి అంటే ఏదో పొరపాటున ఫ్లోలో వచ్చింది అని అనుకోవచ్చు. కానీ అలా రెండు మూడు సార్లు రిపీట్ అయింది. ఆ తర్వాత ఇంటికి పిలించారు. నేను సత్య ఇంటికి వెళ్లాం. అపుడు కూడా నాకు ఇదే రిపీట్ అయింది. చాలా పచ్చి బూతులు తిట్టారు. అమ్మ మీద తిట్టాడు. ఈ భూమి మీద మనం ఉన్నామంటే కారణం తల్లి. ఆమె తర్వాతే ఎవరైనా. నాకు చాలా బాధేసి అప్పుడే చెప్పాను. జీవితంలో మీ దగ్గరకు రాను అన్నాను. ఇలాంటి మాటలు ఎప్పుడూ ఎక్కడా మాట్లాడ వద్దు అని చెప్పి వెళ్లి వచ్చాను అని.... శేఖర్ మాస్టర్ తెలిపారు.

అసలు విషయం చెప్పడం లేదు

అసలు విషయం చెప్పడం లేదు

రాకేష్ మాస్టర్ చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మీకు శేఖర్‌కు ఏం జరిగింది అని అడిగితే అసలు విషయం చెప్పకుండా దాటవేస్తున్నారు. జరిగిన విషయం చెప్పకుండా వాళ్ల పాప బర్త్ డేకు పిలవలేదు, చిరంజీవిగారి సాంగ్ చేస్తే నాకు చెప్పలేదు అని ఏదో చెబుతున్నారు. ఇవన్నీ చాలా సిల్లీ రీజన్స్. మా పాప బర్త్ డే పార్టీ నాకు కూడా తెలియకుండా మా వైఫ్, వాళ్ల తమ్ముడు అరేంజ్ చేశారు... అని శేఖర్ మాస్టర్ తెలిపారు.

నా భార్యకు తాగి ఫోన్ చేసి...

నా భార్యకు తాగి ఫోన్ చేసి...

ఆ తర్వాత రెండు మూడూ రోజులు మాస్టర్ గారు రోజూ నైట్ పూట తాగేసి మా మిసెస్ కి ఫోన్ చేసి.... మీ పాప బర్త్ డేకు నాకు ఎందుకు చెప్పలేదంటూ ఏదో మాట్లాడేవారు. ఇలా తరచూ ఫోన్ చేస్తుండటంతో ఆమె కూడా విసిగిపోయి ఏదో అనేసింది... అని శేఖర్ మాస్టర్ తెలిపారు.

అవన్నీ అబద్దాలు...

అవన్నీ అబద్దాలు...

వాళ్ల మొదటి భార్య నాకు ఫుడ్ పెడుతుంటే వద్దని అందని, నీకు నేను కావాలా? శేఖర్ కావాలా అంటే....నాకు శేఖర్ కావాలన్నట్లు రాకేష్ మాస్టర్ చెబుతున్నారు. నాకు డౌట్ వచ్చి వారి మొదటి భార్యకు ఫోన్ చేశాను. నేను కావాలా? శేఖర్ కావాలా? అన్నారట అంటే నిజం కాదు అని ఆమె అన్నారు. మేము వేరే గొడవ వల్ల విడిపోయాం అని ఆవిడ నాకు స్వయంగా చెప్పారు. ఆయన ఎందుకు అలా అబద్దాలు చెబతున్నారు? నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన గురించి ఇక ఎవరు ఏం అడిగినా చెప్ప దలుచుకోలేదు. ఆయన ఎక్కడున్నా బావుండాలని కోరుకుంటున్నాను... అని శేఖర్ మాస్టర్ తెలిపారు.

నా భార్య బజ్జీలు, పునుగులు అమ్ముకుందా?

నా భార్య బజ్జీలు, పునుగులు అమ్ముకుందా?

నా భార్య పునుగులు, బజ్జీలు, ఇడ్లీలు అమ్ముకుందని రాకేష్ మాస్టర్ చెబుతున్నారు. మాస్టర్ గారు ఎప్పుడూ చూశారో నాకు అర్థం కావడం లేదు. మాస్టర్ గారు ఇంటర్వ్యూలో ఆ మాట అనగానే రెండు మూడు రోజులు మా ఆవిడ భోజనం కూడా చేయలేదు. ఎందుకు అలా అన్నారో వెళ్లి అడుగుతాను అంటే నేనే ఆపాను. మా పక్కింటోళ్లు కేసు పెడదాం అంటే వద్దు అని ఆపాను... అని శేఖర్ మాస్టర్ తెలిపారు.

ఆయన తిండి పెడితే మేము అలా ఎందుకు చేసేవారం?

ఆయన తిండి పెడితే మేము అలా ఎందుకు చేసేవారం?

తిండి పెట్టి పోషించాను అన్నారు. తిండి పెట్టడానికి ఏంటండీ... మాకు ఎవరికీ తినడానికి లేదు... ఆయనకు లేదు మాకు లేదు. ఆయనే తిండి పెడితే మేము దొంగచాటుగా ఫంక్షన్ హాల్స్ కు ఎందుకు వెళతాం? నేను ఇదంతా చాలా బాధతో చెబుతున్నా. కొంచెం బియ్యం ఉంటే మాస్టర్ గారికి వండి పెట్టి మేము ఫంక్షన్ హాలుకు వెళ్లి దొంగచాటుగా తినేసి ఆయకు స్వీట్స్ ఏమైనా ఉంటే తెచ్చి ఇచ్చేవాళ్లం. ఇవన్నీ చెప్పకుండా ఏవేవో అబద్దాలు చెబుతున్నారు. నిజాలు చెబితే యాక్సెప్ట్ చేస్తాను, అబద్దాలు చెబుతున్నారు కాబట్టే బాధేస్తోంది.... అని శేఖర్ మాస్టర్ వాపోయారు.

రాకేష్ మాస్టర్ వల్ల నాకు అవకాశాలు రాలేదు

రాకేష్ మాస్టర్ వల్ల నాకు అవకాశాలు రాలేదు

టాలెంట్ లేకుంటే ఎవరూ పైకి రాలేరు. మాస్టర్ గారి వల్ల నాకు ఒక్క సాంగ్ కూడా రాలేదు. ఆయినా నాకు ఆయన గురువే. ఆయన వద్ద క్లాసికల్ నేర్చుకున్నాను, జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను. ఆయన ఆఫీసులకు తిరుగుతుంటే మేము కష్టపడి ప్రాక్టీస్ చేసి ఇనిస్టిట్యూట్ నడిపేవారం. ఆయనకు వండి పెట్టేవారం. షూటింగ్ చేస్తే రెండు పేమెంట్లు వస్తాయి... డాన్స్, అసిస్టెంట్ పేమెంట్లు. నాకు మ్యారేజ్ అయ్యే వరకు ఒక్క ఐదు పైసలు కూడా నేను తినలేదు, ఇంటికి పంపించలేదు, బట్టలు కొనలేదు. ఏమైనా ఉంటే అమ్మ పంపేది. రెండు పేమెంట్లు మాస్టర్ గారికే ఇచ్చేవాడిని.... అని శేఖర్ మాస్టర్ తెలిపారు.

ఆయన వల్లే నాకు తొలి ఛాన్స్

ఆయన వల్లే నాకు తొలి ఛాన్స్

నాకు ఫస్ట్ సాంగ్ ఇప్పించింది వినయ్ అన్న. ఆయన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఒక ఆరు నెలలు తినడానికి తిండి లేకుండా భాధ పడుతుంటే కొత్త వాడిని అయినా ఆయన పిలిచి అవకాశం ఇప్పించారు.... అని శేఖర్ మాస్టర్ తెలిపారు.

English summary
Tollywood top choreographer Shekar Master Revealed Real Truths about his Guru Rakesh Master.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X