twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఈగ' ని మెచ్చుకున్న ఆస్కార్ అవార్డు దర్శకుడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్న దర్శకుడు ఎవరంటే రాజమౌళి అని చెప్పవచ్చు. హిందీలో ఒక్క చిత్రమూ డైరక్ట్ చేయకుండా ఆయన అక్కడ ప్రముఖులందరి ప్రశంసలూ పొందుతున్నారు. తాజా చిత్రం 'ఈగ' హిందీలోకి 'మఖ్ఖీ' పేరున డబ్బింగ్ అయి రిలీజ్ అవుతున్న నేపధ్యంలో అందరూ ఆయనకి కంగ్రాట్స్ ,విషెష్ తెలియచేస్తున్నారు. తాజాగా ఆయన పై ప్రముఖ దర్శకుడు,ఆస్కార్ అవార్డు విజేత శేఖర్ కపూర్ దృష్టి పడింది. ఆయన ఈ చిత్రం చూడబోతున్నానంటూ కంగ్రాట్స్ చెప్తూ రాజమౌళి కి ఫోన్ చేసారు. ఈ విషయం స్వయంగా రాజమౌళి ట్వీట్ ద్వారా తెలియచేసారు.

    రాజమౌళి తన ట్వీట్ లో..." నాకు ఈ క్షణాలు చాలా అమూల్యమైనవి. నా ఫేవెరెట్ దర్శకుడు శేఖర్ కపూర్ ఫోన్ చేసి ఈగ గురించి మాట్లాడారు. ఆయన రేపు ఈ చిత్రాన్ని చూడబోతున్నారు. చాలా ఆనందగా ఉంది," అన్నారు. అలాగే రెండు రోజుల క్రితం ఈ చిత్రం ప్రీమియర్ షో చూసి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన ఈగ గురించి ట్వీట్ చేస్తూ... "మక్కి చిత్రం రాజమౌళి అద్బుతంగా తెరకెక్కించారు. చాలా బాగుంది. అక్టోబర్ 12న విడుదల అవుతున్న ఈ చిత్రం..అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. రాజమౌళికి,టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ " అని అన్నారు.

    దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కూడా గత కొన్ని రోజులుగా ముంబైలో 'మఖ్ఖీ' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. త్వరలోనే రాజమౌళి ఓ హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి స్పందించారు. ''బాలీవుడ్‌లో 'ఈగ' ఫలితం ఎలా ఉంటుందా? అని ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే... తెలుగు ప్రేక్షకులకు ఈ కథ బాగా నచ్చింది. బాలీవుడ్‌లో అడుగుపెడితే కొత్త కథతోనే వెళ్లాలి. తెలుగులో నేను రూపొందించిన సినిమాల్ని రీమేక్‌ చేయాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే సినిమా అంటే రెండేళ్ల కష్టం. మళ్లీ అదే కథపై మరో రెండేళ్లు వెచ్చించడం నాకు నచ్చదు. బాలీవుడ్‌లో సినిమా తీయాలనుకొంటే కొత్త కథే రాసుకొంటా'' అన్నారు.

    రిలయన్స్ ఎంటర్ టైనర్ వారు ఈచిత్రాన్ని బాలీవుడ్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రంలో రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారు. భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇక ''నాన్నా.. కథ చెప్పవూ..'' అనే సంభాషణతో సినిమా మొదలవుతుంది. ఆ నాన్న గొంతు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిదే. అక్కడ కూడా ప్రారంభ సన్నివేశంలో తండ్రీ కూతుళ్ల సంభాషణ వినిపిస్తుంది. అయితే ఈసారి కథను బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగణ్‌తో చెప్పించారు.

    English summary
    The Oscar winning filmmaker Shekhar Kapur called on Rajamouli to congratulate him on making Eega. Apparently the filmmaker had heard great reviews about the film and admittedly said that he was going to catch the movie in the theatres tomorrow. "One of my most treasured moments... Mr. Shekhar Kapur called and patted me for making Eega/Naane. He's watching it tomorrow..feels great," posted Rajamouli on twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X