»   » కొంతమంది రాశారు. వాళ్లను నేనేం తప్పు పట్టడం లేదు: ఎన్టీఆర్

కొంతమంది రాశారు. వాళ్లను నేనేం తప్పు పట్టడం లేదు: ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ ఆ మధ్యన 'కిక్-2' చిత్రం విడుదల కోసం ఆరు కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారని, అందుకోసం దిల్ రాజు కు సైన్ చేసారంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఎన్టీఆర్ క్లారిఫికేషన్ ఇస్తూ షేర్ ఆడియో పంక్షన్ లో మాట్లాడారు. అటువంటిదేమీ లేదని అదంతా కేవలం మీడియా సృష్టే అని ఎన్టీఆర్ తేల్చేసారు.

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ-'' 'నాన్నకు ప్రేమతో' షూటింగ్‌లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకుని అందరినీ చూసి వెళిపోదామని, నాలుగు రోజులు ఇంట్లోవాళ్లతో సరదాగా గడుపుదామని లండన్ నుంచి ఇక్కడికి వచ్చాను.
అయితే నేనేదో 'కిక్‌ 2'ఆర్థిక సమస్యల్లో ఉందని... అందుకే నేనేదో సంతకాలు పెట్టడానికి వచ్చానని కొంతమంది రాశారు. వాళ్లను నేనేం తప్పు పట్టడం లేదు. కల్యాణ్‌రామ్ అన్నయ్యది ఒకరికి పెట్టే చేయే కానీ తీసుకునే చేయి కాదు. అంత మంచి వ్యక్తి ఆయన. '' అని చెప్పుకొచ్చారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Sher audio: NTR Clarifies About 6 Cr Kick 2 Loan

ఈ ఆడియో వేడుకలో కళ్యాణ్ బాగా ఎమోషనల్ అయ్యి అభిమానులకు నందమూరి అభిమానులంతా ఒకటిగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘నందమూరి తారకరామారావు గారి వృక్షం నుంచి ముందుగా బాబాయ్, ఆ తర్వాత నాన్నగారు, తర్వాత తారక్, నేను వచ్చాము. ముందు ముందు చాలా మంది వస్తారు. మేమంతా ఒక కుటుంబం కానీ అభిమానులు మాత్రం మమ్మల్ని ఎందుకు వేరుచేసి చూస్తున్నారు. మేమేంతా ఒక కుటుంబం అయితే మమ్మల్ని ప్రేమించే అభిమానులంతా కూడా ఒక కుటుంబం లానే ఉండాలి, దయచేసి వేరువేరుగా చూడకండని' కళ్యాణ్ రామ్ అన్నాడు. ఇదే విషయానికి నేను కూడా పూర్తి సపోర్ట్ ని ఇస్తానని ఎన్.టి.ఆర్ తెలిపాడు.


‘పటాస్' సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలోనే ‘షేర్' అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. గతంలో కళ్యాణ్ రామ్ తో కత్తి అనే సినిమా తీసిన మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో నిన్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా లాంచ్ అయ్యింది. చాలా స్టైలిష్ గా ఈ ఆడియో వేడుకని నిర్వహించారు.

English summary
"I've come to India only spend time with my family, especially my son Abhay Ram. But I've not signed any checks or deals to get loan for Kick 2 release and bring it out of shackles", NTR said. He added that Kalyan Ram is not in a position to borrow money from someone. "Even hours before death, Kalyan Ram will give alms but not take one", NTR concluded, thereby disconnecting his name from the Kick 2 episode.
Please Wait while comments are loading...