»   »  కళ్యాణ్ రామ్ ‘షేర్’ సెన్సార్ రిపోర్ట్

కళ్యాణ్ రామ్ ‘షేర్’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షేర్‌'. ఈ చిత్రాన్ని త్వరలో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాత కొమర వెంకటేష్‌ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఎ సర్టిఫికెట్ పొందింది.

Kalyan Ram Sher

ఈ సందర్భంగా నిర్మాత కొముర వెంకటేష్ మాట్లాడుతూ...‘మా చిత్రం సెన్సార్ పూర్తయింది. యూ/ఎ సర్టిఫికెట్ వచ్చింది. కళ్యాణ్ రామ్ కి పటాస్ తర్వాత షేర్ మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. నిర్మాతగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. థమన్ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ మల్లికార్జున్ టేకింగ్ అద్భుతంగా ఉంది' అన్నారు.

డైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: సత్యశ్రీనివాస్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, స్టిల్స్‌: మనీషా ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: హరీష్‌రెడ్డి యల్లన్నగారి, మేనేజర్స్‌: బోడంపాటి శ్రావణ్‌కుమార్‌ గౌడ్‌, కురిమెండ్ల రవీంద్రగౌడ్‌, మేకప్‌: మోహనరావు, కాస్ట్యూమ్స్‌: శ్రీను, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలే, ఛీఫ్‌ కోడైరెక్టర్‌: బూరుగుపల్లి సత్యనారాయణ, కోడైరెక్టర్‌: శేషు బలగ, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్‌, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌, నిర్మాత: కొమర వెంకటేష్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్‌.

English summary
Nandamuri Kalyan Ram's latest offering Sher has completed its censor formalities a short while ago in Hyderabad. The movie was given U/A certificate after some minor cuts. The movie is now one step closer for October 22nd release as Vijaya Dasami Special.
Please Wait while comments are loading...