»   »  దర్శకుడిపై బూతులతో రెచ్చిపోయిన హీరోయిన్

దర్శకుడిపై బూతులతో రెచ్చిపోయిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sherlyn Chopra- Rupesh Paul
ముంబై: కామసూత్ర 3డి హీరోయిన్ షెర్లిన్ చోప్రా ఆ చిత్ర దర్శకుడు రూపేష్ పాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బూతులు ప్రయోగిస్తూ అతనిపై మాటల తూటాలు వదిలింది. అతనొక 'తార్పుడుకాడు'(pimp) అంటూ వ్యాఖ్యానించింది. pimp అంటే....వేశ్యలకు, విటులకు మధ్య బేరాలు కుదిర్చి వేశ్యల సంపాదనలో పర్సంటేజీ తీసుకుని బ్రతికేవాడు అని అర్థం.

షెర్లిన్ చోప్రా ఇక్కడ రాయడానికి వీలులేని బూతులతో కూడిన పదజాలం దర్శకుడు రూపేష్ పాల్‌పై వాడింది. షెర్లిన్ చోప్రా ఇంతగా రెచ్చిపోవడానికి కారణం దర్శకుడు చేసిన వ్యాఖ్యలే. 'రూపేష్ పాల్, కామసూత్ర 3డి సినిమా వల్లనే షెర్లిన్ చోప్రాకు ఇంత మంచి పేరు వచ్చిందనే విషయం ఆమె మరిచి పోవద్దు. ఆమెకు అంతకు ముందు ఎంత రోత/పోర్న్ పేరు ఉండేదో అందరికీ తెలిసిందే' అని రూపేష్ పాల్ స్టేట్మెంట్ ఇవ్వడంతో షెర్లిన్ చోప్రాకు మండి ఇలా రెచ్చిపోయింది.

తన పాపులారిటీ వల్లనే రూపేష్ పాల్ 'కామసూత్ర 3డి' సినిమా నిర్మాణానికి ఫండ్స్ రాబట్టుకోగలిగాడని షెర్లిన్ చోప్రా వాదిస్తోంది. తన వల్లనే పలువురు నిర్మాతలు రూపేష్ పాల్‌తో సినిమాలు తీయడానికి ముందుకు వచ్చారని షెర్లిన్ చోప్రా వాదిస్తోంది. పోర్న్‌కు అడిక్ట్ అయిన రూపేష్ పాల్ పోర్న్‌ను రోత అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని మండి పడింది షెర్లిన్.

రూపేష్ పాల్, షెర్లిన్ చోప్రా మధ్య ఇలాంటి మాటల యుద్దం చాలా కాలంగా సాగుతూనే ఉంది. మరి వీరి మధ్య నిజంగానే గొడవ జరుగుతోందా? లేదా ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసమా? అనేది తేలాల్సి ఉంది. 'కామసూత్ర 3డి' సినిమా మే నెలలో విడుదలకు సిద్దమవుతోంది.

English summary

 Sherlyn Chopra slammed her Kamasutra 3D director Rupesh Paul for behaving badly with her on the sets and called him a 'pimp'. The 29 year old star was sending expletive-filled tweets against Rupesh Paul and in return, he also called her names.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu