»   » ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘కామసూత్ర 3డి’

ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘కామసూత్ర 3డి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా తర్వాత....ఆస్కార్ అవార్డులు అందుకోబోయే లిస్టులో 'కామసూత్ర 3డి' సినిమా చేరబోతోందా? పరిస్థితి చూస్తే అలానే ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ చిత్రంలోని ఐదు పాటలు నామినేట్ అయ్యాయి. ఈ పాటలను చెన్నైకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్స్ సచిన్, శ్రీజిత్ కంపోజ్ చేసారు. రూపేష్ పాల్, ప్రత్యూష్ ప్రకాష్ సాహిత్యం అందించారు.

మానవ శృంగార జీవితం గురించి సవివరంగా తెలిపే ప్రముఖ భారతీయ ప్రాచీన గ్రంథం వాత్సాయన కామసూత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రియల్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుంది. వివాదాస్పద శృంగార తార షెర్లిన్ చోప్రా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈచిత్రానికి కేరళకు చెందిన రూపేష్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు.

86వ ఆస్కార్ అవార్డుల రేసులో....మొత్తం 75 దేశాలకు చెందిన సినిమాలు పోటీ పడుతున్నాయి. 'టైటానిక్' మూవీ ఫేం లియోనార్డో డికాప్రియో నటిస్తున్న 'ది గ్రేట్ గాట్స్‌బీ' తర్వాత 5 సాంగులు నామినేట్ అయిన సినిమా 'కామసూత్ర 3డి' మాత్రమే. జనవిర 16, 2014న....86వ ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు. మరి 'కామసూత్ర 3డి' అవార్డు దక్కుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

కామసూత్ర 3డి చిత్రంలో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా ముఖ్యపాత్రలో నటిస్తోంది. కథానుగుణంగా కొన్ని సీన్లలో ఆమె నగ్నంగా నటించింది. ఇప్పటికే విడుదలైన షెర్లిన్ చోప్రా ఫోటోలు సినిమాపై అంచనాలు పెంచాయి. స్తనాలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా వివిధ భంగిమలతో ఈ చిత్రంలో శృంగార ప్రియులను అలరించనుంది. ఆ మధ్య ఓ వీడియో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి శృంగార ప్రియుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచుతోంది.

English summary
Looks like after Slumdog Millionaire, Kamasutra 3D is the next movie which is reaching the oscars. The movie Kamasutra 3D has made it to the Best Original Song list with Aygiri Nadani, Har Har Mahadeva, I Felt, Of The Soil and Sawariya, the Academy of Motion Picture Arts and Sciences announced. The songs were composed by Chennai-based music directors Sachin and Sreejith, while its lyrics are penned by Rupesh Paul and Pratyush Prakash.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more