»   » రాందేవ్‌ బాబాతో శిల్పాశెట్టి యోగా(వీడియో)

రాందేవ్‌ బాబాతో శిల్పాశెట్టి యోగా(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ముంబై నగరంలో బాబా రాందేవ్‌ యోగా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరానికి బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి హాజరయ్యారు వారిద్దరూ కలిసి స్టేజీపై యోగాభ్యాసం చేశారు. శిల్పాశెట్టి గతంలో యోగా మీద డీవిడిలు రూపొందించారు. ఇప్పుడు ఆమె రాందేవ్‌ బాబాతో కలిసి యోగాసనాలు ప్రాక్టిస్‌ చేయడం ఆమె అభిమానులనే కాక యోగాభ్యాసకులను సైతం ఆకట్టుకుంది. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.

అయితే రామ్ దేవ్ బాబాతో పాటు ఆమె యోగా చేయటం కేవలం పబ్లిసిటీ కోసమే అంటున్నారు. ఆమె కు ఎప్పుడూ ఏదో విదంగా మీడియాలో తన పేరు నలగటం ఇష్టం అని అందుకే ఇదిగో ఇలా స్టేజీ ఎక్కి మరీ ఆసనాలు వేస్తోందని అంటున్నారు.

ఆమధ్య యోగా ఇన్‌స్ట్రక్టర్‌ అవతారం ఎత్తిన ఈమె యోగా పాఠాలపై ఒక డీవీడి కూడా విడుదల చేసింది. అలాగే ఆ మధ్యన ఆమె అవినీతి కుంభకోణంలో ఇరుక్కుంది కూడా. ఇలా ఎప్పుడూ ఏదో ఒక వార్త ద్వారా మీడియాలో నానుతూనే ఉంటూంటుంది.

English summary
yoga queen Shilpa Shetty was seen in Mumbai practicing asanas with non other than India's favourite guru Baba Ramdev at his five-day camp.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu