twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ వరసెట్టేసాడు: 'వీరప్పన్' అంటూ పెద్ద హీరోని దింపుతున్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఫలితంతో సంబంధం లేకుండా రకరకాల నేపథ్యాలతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు రామ్‌గోపాల్‌ వర్మ. తాజాగా మరో రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించే పనిలో పడ్డాడు వర్మ. అదే కిల్లింగ్ వీరప్పన్. వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఒసామా బిన్ లాడెన్ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని వర్మ చెప్పుకొచ్చాడు. అలాంటి క్రిమినల్‌ను చంపిన పోలీస్ కథే ‘కిల్లింగ్ వీరప్పన్'గా వర్మ తెలిపాడు.

    Shiv Raj Kumar as Veerappan Killer

    ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వీరప్పన్‌ను చంపే ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. శివరాజ్ కుమార్ తండ్రి రాజ్‌కుమార్‌ను గతంలో వీరప్పన్ కిడ్నాప్ చేసి హింసించిన విషయం తెలిసిందే. ఆ రకంగా శివరాజ్ కుమార్ రియల్ లైఫ్ విలన్‌పై రీల్ లైఫ్‌లో ప్రతీకారం తీర్చుకున్నట్టవుతుందని వర్మ చెప్పుకొచ్చాడు.

    ఇక కథలతోనూ, సాంకేతికతపరంగానూ ప్రయోగాలు చేయడం ఆయనకు సరదా. ఇప్పుడు అదే దారిలో మరో ప్రయోగానికి పూనుకొన్నారు. 'సైలెంట్‌' పేరుతో మాటల్లేని చిత్రం తీస్తానంటున్నారు. క్రైమ్‌-కామెడీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని అన్ని భాషల పరిశ్రమల్లోనూ విడుదల చేస్తానని వర్మ చెబుతున్నారు.

    Shiv Raj Kumar as Veerappan Killer

    'సైలెంట్‌' ఆలోచన గురించి ఆయన మాట్లాడుతూ ''సినిమాల్లో మొదట దృశ్యం మాత్రమే కనిపించేది. ఆ తర్వాత శబ్దం తోడైంది. టాకీ అనేది సాంకేతికంగా ఒక ముందడుగు అనుకొన్నవాళ్లనంతా ఆశ్చర్యపరుస్తూ మూకీ సినిమాలు అంతరించి పోయిన 50 ఏళ్లకు (1976లో) మెల్‌ బ్రూక్స్‌ అనే హాలీవుడ్‌ దర్శకుడు 'సైలెంట్‌ మూవీ' పేరుతో చిత్రాన్ని తీసి విజయం అందుకొన్నాడు. అప్పట్లో బ్రూక్స్‌ మాట్లాడుతూ '1903లో సంభాషణలు లేని మూకీ సినిమాను అర్థం చేసుకొన్నప్పుడు.. ఇప్పుడెందుకు అర్థం చేసుకోలేరు?' అనుకొని సినిమా చేశానన్నారు.

    మన దేశంలో సింగీతం శ్రీనివాసరావు మూకీ శకం ముగిసిపోయిన 60 ఏళ్లకు 'పుష్పకవిమానం' తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పట్నుంచి ఇప్పటివరకు టాకీ లేని సినిమా ఒక్కటీ రాలేదు. సినిమాలో శబ్దానికి ఎంత ప్రాధాన్యం ఉందో నిశ్శబ్దానికీ అంతే ప్రాధాన్యం ఉందన్న విషయం ఎన్నోసార్లు రుజువైంది. వీటన్నిటి నుంచి స్ఫూర్తి పొంది 'సైలెంట్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను''అని తెలిపారు.

    English summary
    Ram Gopal Varma released a new press note about his next movie and this time he chooses Veerappan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X