twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్-అమల సందడి: ‘శివ’ 25 (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాంగోపాల్ వర్మకు దర్శకుడిగా ఇంత పేరు వచ్చిందంటే...అందుకు ప్రధాన కారణం ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘శివ'. తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిత్రమిది. తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పుకోవాలంటే ‘శివ' ముందు....‘శివ' తర్వాత అనే విధంగా ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

    నాగార్జున, అమల జంటగా నటించిన ‘శివ' చిత్రం విడుదలై అక్టోబర్ 5తో 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో యూనిట్ ఈ సినిమాకు పని చేసిన వారంతా ఒక చోట కలిసి వేడుక చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఇందుకు వేదికైంది. ఈ వేడుకలో శివ చిత్రంలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ - ''జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. కాని, బాధపడను. ఎందుకంటే ‘శివ' అనే సినిమాలో నటించి, నిర్మించి ఒక కరెక్ట్ పని చేశాను. నా జీవితాన్ని మార్చిన సినిమా శివ. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను నవంబర్ నెలలో తిరిగి విడుదల చేస్తున్నాం. డిజిటల్ రీమాస్టర్ ప్రింట్ తో సుమారు 100 థియేటర్లలో ‘శివ' సినిమాను విడుదల చేయబోతున్నాం'' అని చెప్పారు.

    స్లైడ్ షోలో ఫోటోలు....

    శివ టీం..

    శివ టీం..


    శివ చిత్రం 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో నాగార్జున, అమల, రామ్ గోపాల్ వర్మ, జెడీ చక్రవర్తి, తనికెళ్ల భరణి తదితరులు...

    వర్మ, నాగ్, అమల

    వర్మ, నాగ్, అమల


    25 ఇయర్స్ సెలబ్రేషన్స్ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న వర్మ, నాగ్, అమల

    శివ పోస్టర్

    శివ పోస్టర్


    శివ పోస్టర్. అప్పట్లో శివ సినిమా అన్ని విషయాల్లోనూ ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

    నటీనటులు, టెక్నీషియన్స్

    నటీనటులు, టెక్నీషియన్స్


    శివ చిత్రానికి పని చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ తదితరుల...

    ఆనందంగా...

    ఆనందంగా...


    శివ సినిమా సెలబ్రేషన్స్ లో అందరూ ఎంతో ఆనందంగా గడిపారు.

    నాగార్జున-అమల

    నాగార్జున-అమల


    1989లో ‘శివ' చిత్రంలో కలిసిన నటించిన నాగార్జున, అమల..ప్రేమలో పడ్డారు. 1992లో వివాహం చేసుకున్నారు.

    English summary
    Shiva Movie 25 Years Celebrations event held at Hyderabad. Nagarjuna, Amala Akkineni, Ram Gopal Varma, J. D. Chakravarthy and others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X