twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎందుకలా తిప్పుకోవడం.. మీకు ఆడతనం వచ్చేసిందా?: క్లారిటీ ఇచ్చిన శివ శంకర్ మాస్టర్

    |

    సాంప్రదాయ కళా నృత్య రీతుల్ని ప్రదర్శించే పురుషుల్లో నిగూఢంగా 'స్త్రీ'త్వపు ఛాయలు కనిపించడం సహజం. స్త్రీ హంగుతో నృత్యం చేసినట్లుగా అనిపిస్తుంటుంది. హావ భావాల విషయంలో స్త్రీకి ఏమాత్రం తీసిపోని వారి అభినయం మంత్రముగ్దుల్ని చేస్తుంది.

    సినీ ఇండస్ట్రీలో సాంప్రదాయ కళా నృత్యాలకు కేరాఫ్ అయిన శివ శంకర్ మాస్టర్ లోనూ ఈ 'స్త్రీ'త్వపు ఛాయలు ఉట్టిపడుతాయి. తన తాజా ఇంటర్వ్యూలో మాస్టర్ ఇదే ప్రశ్నను ఎదుర్కొన్నారు. 'డ్యాన్స్‌ కంపోజ్‌ చేసి చేసి మీకు ఆడతనం వచ్చేసిందా? ఈ సర్దుకోవడం... ఆ తిరగడం... ఇవన్నీ చూస్తుంటే అలా అనిపిస్తుంటుంది!' అన్న ప్రశ్న ఇంటర్వ్యూలో ఆయనకు ఎదురైంది.

     shiva shankar master clarification on his female expressions

    ఎప్పటిలాగే తనదైన శైలిలో అంతే సున్నితంగా బదులిచ్చారు శివ శంకర్ మాస్టర్. 'మీరంటారు ఆడతనమని. కానీ రౌద్రం కూడా ఉంది నాలో! (నవ్వుతూ). నాట్యం లలిత కళ. శివశంకర్‌లో శివుడు ఉన్నాడు... శంకరీ ఉంది! ఐ కెన్‌ ట్రావెల్‌ విత్‌ ద బోత్‌ సైడ్స్‌.' అని చెప్పారు.

    శివ శంకర్ మాస్టర్ పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చదవండి:శివ శంకర్ మాస్టర్ పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చదవండి:

    ఇదే అంశంపై మరింత వివరణ ఇస్తూ.. 'నేను చదివిన స్కూల్‌ చాలా అద్భుతమైనది. మా గురువుగారు నటరాజ పంతులు చిన్న పాపను చూసి కూడా నమస్కారం చేస్తారు. పాఠశాలలో అయ్యవార్ల పిల్లలంతా పంచ, జుబ్బా, విబూధి పెట్టుకుని సంప్రదాయబద్దంగా వచ్చేవారు. అది చూసి చిన్నప్పటి నుంచీ హిందూ ధర్మంగా అలా కట్టు, బొట్టూ అలవాటు చేసుకున్నా.' అని చెప్పుకొచ్చారు.

    English summary
    Choreographer shiva Shankar given clarification on his female expressions while dancing. Master said he can travel with both female and male dance movements, he added that it is the legacy of Lord Siva.సినీ ఇండస్ట్రీలో సాంప్రదాయ కళా నృత్యాలకు కేరాఫ్ అయిన శివ శంకర్ మాస్టర్ లోనూ ఈ 'స్త్రీ'త్వపు ఛాయలు ఉట్టిపడుతాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X