»   » చెత్త మూవీ, వ్యభిచారమే, చూడొద్దు: హిట్టయితే హీరోకు పనోడిగా చేరుతా!

చెత్త మూవీ, వ్యభిచారమే, చూడొద్దు: హిట్టయితే హీరోకు పనోడిగా చేరుతా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ.... స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'శివాయ్'. ఈ సినిమా రేపు(అక్టోబర్ 28)న విడుదలవుతుండగా బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ సంచలన ప్రకటన చేసారు.

శివాయ్‌ సినిమా చూసానని, చాలా చెత్తగా ఉందంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమాలోని ఆఖరి అరగంటలో అజయ్‌ కేవలం పర్వతాలు ఎక్కడమే చూపించారు. కేవలం పర్వతాలు చూపించడానికే సినిమా తీశారేమో. అసలు ఈ సినిమా చూడటం సమయం వృథా, డబ్బు వృథా అంటూ కామెంట్ చేసారు.

తెలుగులో రామ్ గోపాల్ వర్మ లాగే.... బాలీవుడ్లో కమల్ ఆర్ ఖాన్ తరచూ సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటారు. 'యే దిల్‌ హై ముష్కిల్‌', 'శివాయ్‌' చిత్రాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో 'శివాయ్‌' సినిమాపై చెత్త రివ్యూలు ఇవ్వాలని కరణ్‌ తనకు పెద్ద మొత్తంలో డబ్బులిచ్చాడని కమల్‌ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.

శివాయ్ మూవీపై కమల్ ఆర్ ఖాన్ చేసిన మరిన్ని సంచలన కామెంట్స్....కు సంబందించిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

వ్యభిచారం గురించే

శివాయ్‌ మూవీలో విషయం ఏమీ లేదు. కేవలం బల్గేరియాలో జరిగే వ్యభిచారం గురించే సినిమాలో ఉంది. భారతీయులు సినిమా చూసి తెలుసుకోవాల్సిన అవసరమైన విషయాలే ఏమీ లేవంటూ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేసారు.

ప్రతి భారతీయుడు అవినీతి పరుడే అన్నట్లు..

సినిమాలోని ఓ సీన్లో ప్రతీ భారతీయుడు అవినీతిపరుడు అన్నట్లు చూపించారు అంటూ కమల్ ఆర్ కాన్ ఈ సినిమాపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.

హిట్టయితే పనోడిగా చేరుతా

ఈ సందర్భంగా కమల్ ఆర్ ఖాన్ అజయ్‌ దేవగన్ ఫ్యాన్స్‌ అందరికీ ఛాలెంజ్‌ విసిరారు. శివాయ్‌ సినిమా హిట్టయ్యే ఛాన్సే లేదు. ఒకవేళ బాగా హిట్టయి బాగా ఆడితే నేను అజయ్‌ దేవగన్ ఆఫీస్‌లో పనోడిగా చేరతాను, ఇకపై నా జీవితంలో ఏ సినిమాకు రివ్యూలు ఇవ్వను అంటూ ట్వీట్ చేసారు.

మౌంటోనీర్

మౌంటోనీర్

ఇందులో అజయ్ దేవగన్ హిమాలయన్ మౌంటెనీర్ గా కనిపించబోతున్నాడు. లార్డ్ శివుడి చుట్టూ తిరిగే కథాంశం అంటూ ప్రచారం జరుగుతోంది.

భారీ బడ్జెట్, అజయ్ దేవగన్ బాగా కష్టపడ్డాడు

ఈ సినిమాలో హీరోగా చేస్తూ... దర్శకత్వం వహిస్తూ... భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అజయ్ దేవగన్ ఈ సినిమా కోసం పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

English summary
"If Shivaay will work at boxoffice then I will work as a office boy in ajaydevgn office for rest of my life. It's my promise to entire world." Kamal R Khan tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu