»   » చిరంజీవి తొత్తు అన్నారు: పరిటాల వార్నింగ్, మోహన్ బాబుతో వివాదంపై శివాజీరాజా!

చిరంజీవి తొత్తు అన్నారు: పరిటాల వార్నింగ్, మోహన్ బాబుతో వివాదంపై శివాజీరాజా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కొత్త ప్రెసిడెంటుగా ఎన్నికైన శివాజీరాజా ఇటీవల ఓ వెబ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలుచెప్పుకొచ్చారు. ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది, గతంలో ఓసారి మోహన్ బాబు స్వయంగా ఏరి కోరి 'మా'జనరల్ సెక్రటరిటీ చేస్తే ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయం చెప్పుకొచ్చారు.

దీంతో పాటు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందంతో జరిగిన గొడవ గురించి, అలీ తనకు ఎందుకు దూరంగా ఉంటున్నాడనే విషయాన్ని, రాజేంద్ర ప్రసాద్ గురించి కూడా పలు విషయాలు చెప్పుకొచ్చారు శివాజీ రాజా.

పిలిచి పదవిచ్చారు

పిలిచి పదవిచ్చారు

మోహన్ బాబు గారంటే నాకు చాలా చాలా ఇష్టం. ముక్కు సూటిగా ఉంటాడు. రఫ్ అండ్ టప్ గా ఉంటాడు. ఒకసారి నన్ను, శ్రీకాంత్ ను పిలిచి తమ్ముడు నేను ప్రెసిడెంటుగా ఉంటాను నువ్వు జనరల్ సెక్రటరీగా ఉండు అన్నారు. వెంటనే ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న దాసరి గారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన కూడా ఓకే చెప్పారు. మోహన్ బాబు గారి దగ్గర మనకు ఆలోచించుకునే సమయం కూడా ఉండదు. ఆయన మాటఅంటే మాటే. నాపై అపుడు ఎందుకు అంత ప్రేమ చూపించారో తెలియదు. నటుడు మల్లికార్జున్ ను కాదని నన్ను పెట్టారు. ఇంత చిన్న వయసులో మనకెందుకులే ఇంత పెద్ద పదవి అని శ్రీకాంత్ నన్ను పక్కకు పలిచి చెప్పినా మోహన్ బాబు మాట కాదనలేక జనరల్ సెక్రటరీగా ఓకే చెప్పాను.... అని శివాజీ రాజా తెలిపారు.

కొందరు నా గురించి ఆయన వద్ద బ్యాడ్ గా చెప్పారు

కొందరు నా గురించి ఆయన వద్ద బ్యాడ్ గా చెప్పారు

కొందరు నా గురించి మోహన్ బాబు వద్ద బ్యాడ్ గా చెప్పారు. ఆయన నన్ను బాగా చూసుకునే వారు. నా గురించి ఎవరో బ్యాడ్ గా చెబితే నమ్మాడని ఆయనలో మార్పు చూస్తే అర్థమైంది. ఆయన అలా ఉండటంతో నేను కాస్త దూరంగా ఉన్నా... దీంతో నా గురించి బ్యాడ్ గా చెప్పిన కాకులు ఆయనకు మరింత దగ్గరయ్యాయి. అపుడు దూరంగా ఉండి నేను తప్పు చేసా. ఆయనకు దగ్గరగానే ఉంటే నా గురించి అలా ఎందుకు బ్యాడ్ గా చెప్పారో తెలిసేది... అని శివాజీ రాజా తెలిపారు.

రాజీనామా చేసా

రాజీనామా చేసా

మరో ఐదారు నెలల్లో జనరల్ సెక్రటరిగా నా పదివి కాలం పూర్తవుతుందనగా రాజీనామా చేసాను. అపుడు మోహన్ బాబు గారు తమ్ముడు ఒకసారి ఆలోచించుకో అన్నారు. నాపై నమ్మకంతో మోహన్ బాబు గారి లాంటి వ్యక్తి నిలబెడితే అలా చేయడం తప్పే. తర్వాత ఆయనతో రిలేషన్ తెగిపోయింది... అని శివాజీ రాజా తెలిపారు.

అబద్దం చెప్పొద్దన్నారు అందుకే అలా చెప్పా

అబద్దం చెప్పొద్దన్నారు అందుకే అలా చెప్పా

తమ్ముడూ నాకు అబద్దం చెప్పేవాళ్లంటే ఇష్టం ఉండదయ్యా ఏదైనా సరే ముక్కు సూటిగా చెప్పాలి అనే వారు మోహన్ బాబు గారు. ఒకసారి ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజుతో ఆయన ఇంట్లో ఉన్నారు. నన్నెందుకో రమ్మన్నారు. నే వెళ్లాను. ఏమయ్యా మన గురించి ఏమనుకుంటున్నారు బయట అన్నారు. అన్నయ్యా మీరు మనుషులను పంపి ఎవరినినో కొట్టించారట కదా దాని గురించి మాట్లాడుకుంటున్నారు అన్నాను. నేను ఇలా అనడంతో పక్కనే ఉన్న శ్రీనివాసరాజు అనే వ్యక్తి నా కాలును నొక్కుతున్నాడు. ఆయనకు అబద్దం చెప్పద్దు అని మాట ఇచ్చాను. అందుకే ఇలా చెప్పాను. రెండు నిమిషాలు అలా మౌనంగా ఉన్న మోహన్ బాబుగారు... అవసరం అయితే నేనే వెళ్లి కొడతానయ్యా ఎవరినో ఎందుకు పంపించి కొట్టిస్తాను అన్నారు. నవ్వేసారు. లేదన్నయ్యా మీరు ఉన్నదున్నట్టుగా చెప్పమన్నారు కాబట్టి చెప్పాను... అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.

చిరంజీవి తొత్తయ్యా అన్నారు

చిరంజీవి తొత్తయ్యా అన్నారు

ఓసారి నన్ను చిరంజీవి తొత్తు అన్నారు మోహన్ బాబుగారు. ఇలా అనేసారేంటి అని భాధ పడ్డా. నేను చిరంజీవిగారి అభిమానిని, క్రిష్ణగారి అభిమానిని, చక్కర్ మే రక్కర్ విషయంలో మోహన్ బాబుగారి అభిమానిని, అలా ఎందుకన్నారో తెలియదు. నేను ఇద్దరు ఫ్యామిలీస్ తోనూ సినిమాలు చేయలేదు. నాగబాబుతో మాత్రమే చేసా. తొత్తు అంటే స్నేహం అనే మీనింగుతో అన్నారేమో తెలియదు. నేనంటే ఆయనకు ఇష్టం లేదని అనుకుంటున్నాను. ఇటీవల బర్త్ డే సందర్బంగా ఫోన్ చేసినా ఎత్తలేదు.. అని శివాజీ రాజా అన్నారు.

బ్రహ్మానందంతో గొడవ

బ్రహ్మానందంతో గొడవ

బ్రహ్మానందంతో గొడవ నిజమే. తర్వాత కలిసిపోయాం, నన్ను తిరుపతి కూడా తీసుకెళ్లారు. డబ్బంటే అందరికీ ఇష్టమే, డబ్బు విషయంలోనే గొడవ. నేను, భరణి, మల్లిఖార్జున్ మొత్తం అంతా కలిసి బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్టు పెట్టాం. దాంట్లో డబ్బులు మిస్ యూజ్ అయ్యాయని నాకెవరో వచ్చి చెప్పడం, అడిగితే అక్కడి నుండి రెస్పాన్స్ రాక పోతే తర్వాత ఏదో గొడవైంది... తర్వాత దాసరిగారు, మోహన్ బాబు గారు అంతా కలిసి మాట్లాడి సెట్ చేసారని శివాజీ రాజా తెలిపారు.

పరిటాలతో వార్నింగ్

పరిటాలతో వార్నింగ్

ఓసారి మోహన్ బాబు గారు ఫోన్ చేసారు. తమ్ముడు ఎక్కడున్నావ్ అన్నారు. డబ్బింగ్ చెబుతున్నాను అన్నాను. అర్జంటుగా నాయుడిగారి స్టూడియోకు రావాలన్నారు. డబ్బింగ్ పూర్తయ్యాక వస్తానన్నాను. అపుడు మోహన్ బాబు వద్ద ఉన్న శ్రీహరి చెప్పాడు....ఒరేయ్ ఇక్కడ చాలా సీరియస్ గా ఉంది. ఇపుడు రావొద్దు అన్నాడు. మాటిచ్చాను కాబట్టి వస్తానన్నాను. మోహన్ బాబు సిరీయస్ గా ఉన్నారు, పరిటాల రవి అక్కడే ఉన్నారు. మోహన్ బాబుగారితోగానీ, ఆయన ఫ్యామిలీతో కానీ అప్పటి వరకు సినిమాలేవీ చేయలేదు. పెద్దగా పరిచయం కూడా లేదు. మనకేమో భయం అంటే తెలియదు. చిన్నప్పటి నుండి అంతే. ఎందుకు గొడవలు... నీ గురించి అంతా ఇక్కడ మంచిగానే చెబుతున్నారు కదా అన్నారు. సరే అని వెళ్లి పోయాను. ఆయన నా లాంటోన్ని దూరం చేసుకున్నారేమో. ఏది శాశ్వతం కాదిక్కడ... అని శివాజీ రాజా తెలిపారు.

మురళీ మోహన్ కు క్షమాపణ

మురళీ మోహన్ కు క్షమాపణ

మురళీ మోహన్ గురించి గతంలో ‘మా' ఎలక్షన్ సమయంలో ఈ ఓటమి జయసుధది కాదు మురళీ మోహన్ గారిది అన్నాను. అలా మాట్లాడటం నా తప్పే. ఆ ఎన్నికల్లో ఆయన ప్రమేయం ఏమీ లేదని తర్వాత తెలిసింది. ఈ విషయంలో ఆయనకు క్షమాపణ చెబుతున్నాను అని శివాజీ రాజా తెలిపారు.

రాజేంద్ర ప్రసాద్ తెలివితక్కువోడు

రాజేంద్ర ప్రసాద్ తెలివితక్కువోడు

రాజేంద్ర ప్రసాద్ నా అన్న కాదు. నా కంటే సీనియర్. శ్రీమంతుడు సినిమా సమయంలో ఆయనకు మద్దతు ఇస్తాను అని గుళ్లో ప్రమాణం చేసాను కాబట్టి గత మా ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా నిలిచా. ఆయనకు మద్దతు ఇస్తే వ్యతిరేకత ఎందుకు వచ్చిందో 10 రోజుల్లో తెలిసిపోయింది. ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అద్భుతమైన మనిషి అవ్వక్కర్లేదు. రాజేంద్రప్రసాద్ తెలివైనోడు అని నేను అనను. తెలివి తక్కువోడు, ప్రామిస్ చేయొద్దని చెప్పినా వినడు. చేస్తాడు. దేనికైనా లిమిట్ ఉంటుంది. అంత వరకే చేయాలి అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.

నా కాలి గోటికి కూడా సరిపోడు ఎదవ

నా కాలి గోటికి కూడా సరిపోడు ఎదవ

ప్రముఖ నటుడు రంగనాథ్ మరణించినపుడు ఆయన్ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు తీసుకొస్తే... ఓ పెద్ద మనిషి ఆయన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అన్నాడు. నాకు వెంటనే కొపం వచ్చి తిట్టేసాను. అలా మాట్లాడిన మనిషి నా కన్నా గొప్ప నటుడే... కానీ నా కాలి గోటికి కూడా సరిపోడు ఎదవ... అంటూ మండి పడ్డారు శివాజీ రాజా. అయితే అతడి పేరును శివాజీ రాజా వెల్లడించలేదు.

తల్లి, తండ్రి మీడియాకెక్కడంపై

తల్లి, తండ్రి మీడియాకెక్కడంపై

మా మదర్, ఫాదర్ నేను వారిని సరిగా చూసుకోవడం లేదని అప్పట్లో మీడియాకెక్కారు. వాళ్లు అలా టీవీకెక్కడానికి కారణం నా తోటి ఆర్టిస్టే... వాడి జీవితమంతా ఇలాంటి దరిద్రపు పనులే చేసాడు, అందుకే ముందే వెళ్లిపోయాడు. నేను వందకోట్లు సంపాదించాను. మా తల్లిదండ్రులకు సరిగా చూసుకోవడం లేదని చెప్పడం వల్లే వారు నమ్మేసి అలా టీవీ కెక్కారు. తర్వాత అంతా సెట్టయిపోయింది అని శివాజీ రాజా తెలిపారు.

ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒకరిని పొడిచా

ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒకరిని పొడిచా

ఇండస్ట్రీకి వచ్చే ముందు బస్టాండులో ఒక వ్యక్తిని కత్తితో పొడిచిన మాట వాస్తమే అని శివాజీ రాజా ఒప్పుకున్నారు. అప్పట్లో ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటే మీ నాన్నను ఎవరో కొడుతున్నారని చెప్పడంతో ఇంటికెళ్లి వంటింట్లో ఉండే కత్తితో వెళ్లాను. బస్టాండ్లో దొరికేసాడు...మానాన్నను కొట్టాడన్న కోపంతో పొడిచేసాను అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.

అలీ గురించి

అలీ గురించి

అలీతో విబేధాలు ఏమీ లేవు. నాతో మా ఎలక్షన్స్ లో ఓడి పోవడంతో అతడే దూరంగా ఉంటున్నాడు. వాళ్ల తమ్ముడు ఖయ్యుం నాతో బావుంటాడు అని శివాజీ రాజా తెలిపారు.

English summary
Shivaji Raja about Mohan Babu controversy. MAA president Shivaji Raja sensation comments about Tollywood industry. Sivaji Raja is a Telugu comedian and actor. Sivaji Raja appeared in more than 400 films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu