»   » ఒకే మాట‌..బాట‌.. ఇద్దరం క‌లిసి ల‌వ‌కుశ‌లా ప‌నిచేస్తున్నాం.. శివాజీరాజా

ఒకే మాట‌..బాట‌.. ఇద్దరం క‌లిసి ల‌వ‌కుశ‌లా ప‌నిచేస్తున్నాం.. శివాజీరాజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మామూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్- ఫిల్మ్ న‌గ‌ర్ హౌసింగ్ సొసైట్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం ఉదయం హైద‌రాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద చ‌లివేంద్రం ప్రారంభ‌మైంది. సీనియ‌ర్ న‌టి జ‌మున ముఖ్య అతిధిగా విచ్చేసి చ‌లివేంద్రాన్నిప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మా జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, సి.గోవింద‌రావు, హ‌రినాథ్, ఆర్. మాణిక్ త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

అనంత‌రం జ‌మున మాట్లాడుతూ, శివాజీరాజా, న‌రేష్ ఆధ్వ‌ర్యంలో మా ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేస్తోంది. అన్నీ విజ‌య‌వంతం అవుతున్నాయి. ఇప్పుడు వేస‌విని దృష్టిలో పెట్టుకుని ప్ర‌జ‌లంద‌రికీ చ‌లివేంద్ర ఏర్పాటు చేసి చ‌ల్ల‌టి మంచినీళ్లు, మ‌జ్జిగ‌, నిమ్మ‌ర‌సం అదించ‌డం చాలా సంతోషంగా ఉంది. నా చేతులు మీదుగా చ‌లివేంద్రం ప్రారంభిచ‌డం మ‌రింత ఆనందాన్ని ఇస్తుంది. ఏ కార్య‌క్ర‌మం చేయ‌డానికైనా డ‌బ్బు అవ‌స‌రం. కార్య‌క్ర‌మం పెద్ద‌దే..కానీ నేను ఇచ్చే డ‌బ్బు చాలా చిన్న‌ది(న‌వ్వుతూ) అని అన్నారు.

shivaji Raja: Naresh and me working like Lava kusa

మా అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, న‌రేష్‌, నేను ఒకే మాట‌..బాట‌లో వెళ్తున్నాం. ఇద్దరం క‌లిసి ల‌వ‌కుశ‌లా ప‌నిచేస్తున్నాం. ఈ ఏడాది ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం. అందులో ఇది ఒక‌టి. ప్ర‌జ‌లంతా మా సేవ‌లను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరుకుంటున్నాం. కృష్ణా న‌గ‌ర్ లో కూడా మ‌రో చ‌లివేంద్రం ఏర్పాటు చేయాల‌నుకుంటున్నాం. విజ‌య్ చంద‌ర్ గారు హోల్డేజ్ హోమ్ కు రెండు ఎక‌రాల భూమి కూడా ఇచ్చారు. ఆ ప‌నులు త్వ‌ర‌లో ప్రారంభం అవుతాయి అని అన్నారు.

మా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ మాట్లాడుతూ, మా సిల్వ‌ర్ జూబ్లి సంవ‌త్స‌రంలో మంచి కార్య‌క్ర‌మాల‌తో ముందుకెళ్తున్నాం. ప్ర‌తీ ఏడాది వేస‌విలో చ‌లివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ప్ర‌జ‌ల దాహాన్ని ఎంతో కొంత తీరుస్తున్నాం. ఈ ఏడాది కూడా వాళ్ల అవ‌స‌రాన్ని దృష్టిలో పెట్టుకునే ఏర్పాటు చేశాం. వేస‌వి ఉన్నంత కాలం మంచి నీరు, మ‌జిగ స‌ర‌ఫ‌రా చేస్తాం. ఈ అవ‌కాశాన్ని అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.

shivaji Raja: Naresh and me working like Lava kusa

సీరియ‌ర్ న‌టి గీతాంజ‌లి మాట్లాడుతూ, చ‌ల్ల‌టి కుండ‌ల్లో నీళ్లు ఆరోగ్య‌క‌రంగా ఉంటాయి. ప్ర‌తీ ఒక్క‌రు కూడా సొంత ఇళ్ల‌లో కుండ‌ల్లో నీరు త్రాగితే ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తావు. మా-ఫిల్మ్ న‌గ‌ర్ హౌసింగ్ సోసైటి వారు క‌లిసి క్వాలిటీ బిస్ల‌రీ వాట‌ర్, నిమ్మ‌రసం, మ‌జ్జిగ అంద‌జేస్తున్నారు. ఈ సేవ‌ల‌ను అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.

సీనియ‌ర్ న‌టుడు విజ‌య్ చంద‌ర్ మాట్లాడుతూ, శివాజీ రాజా-న‌రేష్ మంచి భావాల‌తో ముందుకెళ్తున్నారు. ఎండా కాలంలో ప్ర‌జ‌ల దాహాన్ని తీర్చే నీరు, మ‌జ్జిగ అందించ‌డం సంతోషంగా ఉంది. ఇలాంటి కార్య‌క్ర‌మాలు ఎన్ని చేసినా నా స‌హ‌కారం ఎంతోకొంత ఉంటుంది అని అన్నారు.

shivaji Raja: Naresh and me working like Lava kusa

కాజా సూర్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ఉద‌యం తొమ్మ‌ది గంట‌ల‌ నుంచి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కూ మ‌జ్జిగ‌, నీరు అందుబాటులో ఉంటాయి. సినిమాకు సంబంధించిన వారు ఎక్కువ‌గా ఫిలినంగ‌ర్ - ఛాంబ‌ర్ వ‌ద్ద‌కు ఎక్కువ‌గా వ‌స్తుంటారు. వాళ్లంద‌ర్నీ దృష్టిలో పెట్టుకునే ఇక్క‌డ ఏర్పాటు చేసాం. అలాగే ఫిలిం న‌గ‌ర్ ప్ర‌జ‌లంతా కూడా ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. దాత‌లంద‌రి స‌హ‌కారంతోనే చ‌లివేంద్రం ఏర్పాటు చేయ‌గ‌లిగాం అని అన్నారు.

English summary
Movie Artists Association, Film Nagar Housing society jointly organsing the Chalivendram at Hyderabad film Chamber. Actress Jamuna inaugarated the event. Shivaji Raja, Naresh others participated this opening event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X