»   » ఆదరిస్తే..ఉంటాను..లేదంటే తిరిగు ప్రయాణం!

ఆదరిస్తే..ఉంటాను..లేదంటే తిరిగు ప్రయాణం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటికే చిన్న నిర్మాతలను బ్రతకనివ్వడం లేదంటూ హీరో రాజా..కొందరు నిర్మాతల పై దాడి చేస్తుంటే..మరో హీరో శివాజీ తాజాగా ఓ చిత్రాన్ని నిర్మించి..సున్నితమైన ప్రేమ కథ ఇది..గులాబీ పువ్వులా సున్నితంగా వుంటుంది. అది మీ చేతిలో పెడుతున్నాను..నలిపి ప్రక్కన పడేయకుండా రెండున్నర గంటలపాటు సున్నితంగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. దయచేసి నన్ను ఆదరించండి అంటూ తన సినిమాకు ప్రచారం చేసుకుంటున్నాడు.

అంతే కాదు..సినిమా పరిశ్రమకు వచ్చిన తొలిరోజున ఒకపెట్టె నలిగిపోయిన దస్తులతో వచ్చాను..మీరు చక్కగా ఆదరించడంతో ఈ రోజు ఓ సినిమాను నిర్మించగలిగే స్థాయికి చేరుకోగలిగాను..ఈ సినిమాకు మీరు విజయం అందిస్తే..నిర్మాతగా, నటుడిగా కొంతకాలం మీ అభిమానాన్ని పొందాలని అనుకుంటున్నాను. లేదంటే మళ్లీ ఏలా వచ్చానో అలానే మారి తిరిగి వస్తుంది..తప్పకుండా నా..కాదు..ఈ ప్రేమకథా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తారని ఆశిస్తున్నాను. అని తొలి చిత్ర నిర్మాత శివాజీ వేడుకుంటున్నాడు.

ఇంతకాలం తనదైన నటనతో అందరికీ అనందాన్ని కలిగించిన శివాజీ..నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'తాజ్ మహల్" ఈ రోజు విడుదల అవుతుంది. ఈ చిత్రం విజయం సాధించి. శివాజీకి నాలుగు డబ్బులు తెచ్చిపెట్టి..మరో మంచి చిత్రాన్ని మనకు అందించాలని మనస్సూర్తిగా కోరుకుందాం..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu