»   »  వర్షం దర్శకుడు హఠాన్మరణం

వర్షం దర్శకుడు హఠాన్మరణం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shoban
సంచలనం సృష్టించిన వర్షం సినిమా దర్శకుడు శోభన్ గుండెపోటుతో సోమవారం హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 44 సంవత్సరాలు. శోభన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొత్త సినిమాకు కథపై చర్చించేందుకు ప్రముఖ నటి భూమిక నివాసానికి వెళ్లిన శోభన్ కు అక్కడ ఉండగానే గుండెపోటు రావడంతో వెంటనే మాదాపూర్లోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు శోభన్ భౌతిక కాయాన్ని సందర్శించారు. తెలుగు సినీ పరిశ్రమలో రాంగోపాల్ వర్మతో పనిచేసిన శోభన్ ఆతరువాత కృష్ణవంశీతో కూడా కలిసి పనిచేశాడు. ఒక రాజు ఒక రాణి సినిమాలో అతిథి పాత్రను కూడా పోషించారు. మహేష్ బాబు హీరోగా రూపొందిన బాబీ శోభన్ కు దర్శకుడిగా తొలి సినిమా. అనంతరం ప్రభాస్, త్రిషలతో రూపొందిన వర్షం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X