»   »  శోభనకు కోపం వచ్చింది

శోభనకు కోపం వచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu


డాన్సర్ కమ్ యాక్టర్ శోభనకు కోపం వచ్చింది. ముంబై నుంచి వెలువడే ముంబై మిర్రర్ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా తమిళ పత్రికల వారు ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తున్నారని శోభన గరం గరం అవుతోంది. తనకు పెళ్లైనట్టు ముంబై మిర్రర్ లో వచ్చిన వార్తలో నిజం ఉందో లేదో చూసుకోకుండా తమిళ పత్రికలు కూడా రాసేయడమేనా అంటూ నానా తిట్లు తిడుతోంది.

శోభన అంతటితో ఊరుకోలేదు. తమిళ మీడియాలో సీనియర్ జర్నలిస్ట్ ను ఒకరిని పిలిచి క్లాస్ పీకింది... గాసిప్స్ రాయడం ముంబై మీడియాకు అలవాటు. వారు ఏది నిర్ధారణ చేసుకోకుండా రాసేస్తుంటారు. మీరు కూడా వారి బాటలోనే ఎందుకు పయనిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు..ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే కచ్చితంగా మిమ్మల్నందరినీ పిలుస్తాను...నటీమనుల ప్రైవసీని గౌరవించండ..ని శోభన అంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X