»   »  'బాహుబలి'..పై కాలమిస్ట్ శోభాడే కామెంట్

'బాహుబలి'..పై కాలమిస్ట్ శోభాడే కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్‌ చిత్రం 'బాహుబలి-ద బిగినింగ్‌' భారీ రికార్డులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ కాలమిస్ట్ శోభాడే చూడటం జరిగింది. వెంటనే ఆమె ట్విట్టర్ లో తన స్పందనను తెలియచేసారు. ఆమె ఈ చిత్రం గురించి ఏమన్నారో మీరే చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శోభాడే ట్విట్ లో .."వావ్! 'బాహుబలి' గురించి ఇదొక్కటే మాట...ఫ్యాకెడ్ థియోటర్..అవతార్ మీట్స్ స్పార్టకస్ మీట్స్ మహాభారత !" అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు.

చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
రూ.100కోట్లు.. 200.. 300.. కోట్లు దాటిపోయింది. ప్రస్తుతం బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా రూ.355కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇంకేముంది రూ.500కోట్ల కలెక్షన్‌ సినిమాలో జాబితాలో చేరేందుకు దూసుకెళ్తోంది.

Shobha De praises Rajamouli's Baahubali

అంతేకాదు బాలీవుడ్‌లో అధిక వసూళ్లు సాధించిన సినిమాలతో పోటీ పడుతోంది. జులై 17న విడుదలైన బాలీవుడ్‌ సినిమా 'భజరంగీ భాయీజాన్‌' ప్రపంచవ్యాప్తంగా రూ.226కోట్లు వసూలు చేసి ప్రస్తుతం బాహుబలికి గట్టి పోటీ ఇస్తోంది.

ఇక బాహుబలి సినిమా విడుదలైన తొలి రోజు నుంచే రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. జులై 10 శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన బాహుబలి ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.68కోట్ల షేర్‌ వసూలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమ రికార్డుగా చెప్తున్నారు.

బాలీవుడ్‌లో షారూక్‌ ఖాన్‌ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్‌' సినిమా తొలి రోజు రూ.65కోట్ల షేర్‌ సాధించినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్‌ తొలిరోజు రికార్డులను బద్ధలు కొట్టేసింది.

English summary
Celebrity columnist Shobha De tweeted, "Wow! Just one word for 'Bahubali' - spectacular! Packed theatre.Riveted audience.Avatar meets Spartacus meets Mahabharata.Cinematic coup!" .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu