»   » తెలుగు అమ్మాయే...బికినీ వేసింది, బాలీవుడ్ ని గెలిచింది, కానీ మనమే..

తెలుగు అమ్మాయే...బికినీ వేసింది, బాలీవుడ్ ని గెలిచింది, కానీ మనమే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 2014 కింగ్‌ఫిషర్ క్యాలెండర్ విడుదలైంది. ఎప్పటిలాగే శృంగార ప్రియులతో పాటు,సినిమా జనం కూడా ఆ క్యాలెండర్ ని ఆసక్తిగా తిరగేసారు. అయితే అందగత్తెల ఫొటోలు చూస్తున్న తెలుగు వారికి ఒక్క సారి షాక్ కు గురైనట్లైంది. ఎందుంకేట ఆ అందగత్తెల్లో ఓ తెలుగమ్మాయీ ఉంది. క్యాలెండర్ మధ్యలో తళుక్కుమంది. ఆమె పేరే -శోభిత ధూళిపాళ.

మన తెలుగు అమ్మాయి ..కింగ్ ఫిషర్ క్యాలెండర్ మీద ఎక్కిందంటే ఖచ్చితంగా వరసపెట్టి మన తెలుగు హీరోలందరూ ఆమెను తమ ప్రక్కన బుక్ చేసుకుంటారు. ఆమె తెలుగు పరిశ్రమలో బిజీ అయిపోతుందని భావించారు. కానీ అంత సీన్ లేదని అతి త్వరలోనే తేలిపోయింది. ఆమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ తెలుగులో పట్టించుకునే వారే కరువు అయ్యారు.

ఇప్పటికే స్వాతి, శ్రీదివ్య, ఆనంది లాంటి తెలుగమ్మాయిలకు తమిళనాట ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే మనం మాత్రం వాళ్లను పట్టించుకోం...వాళ్లను మన సినిమాల్లో తీసుకోం. తెల్లగా కనపడితే చాలు అనుకుని ముంబయి భామల్ని తీసుకొచ్చి ఆఫర్స్ ఇచ్చి, వారిని ఎక్కడికో తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తూంటాం.

రీసెంట్ గా అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 'రమణ్ రాఘవ్ 2.0' సినిమాలో అద్భుత నటనతో ఆకట్టుకుంది శోభిత. బాలీవుడ్ మీడియా మొత్తం ఆమె గురించి మాట్లాడింది. కానీ ఆమెకు ఇక్కడ తలిచిన వారే కరువు అయ్యారు.

చాటి చెప్పింది

చాటి చెప్పింది

మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ కూడా గెలిచిన శోభిత గ్లామరస్ గా కనిపించడానికి కూడా సిద్ధమని కింగ్‌ఫిషర్ క్యాలెండర్ ఫొటో షూట్‌తో చాటిచెప్పింది.

బికినీ వేసినా

బికినీ వేసినా

బికినీ వేసి మరీ గ్లామర్ ప్రదర్శన చేసినా సరే, ఆమెను తెలుగు దర్శక నిర్మాతలెవ్వరూ పట్టించుకోలేదు.

రీసెంట్ గా ...

రీసెంట్ గా ...

ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో డైరక్ట్ గానే ఆమె స్పందించింది. తన ఆవేదనను వ్యక్తం చేసింది

శోభిత మాట్లాడుతూ...

శోభిత మాట్లాడుతూ...

బ్యాక్ గ్రౌండ్ లేని తన లాంటి వాళ్లకు అవకాశాలు వస్తే తానేంటో నిరూపించుకుంటాను అని కూడా చెప్తోంది.

నిజం కాదు

నిజం కాదు

‘‘మన తెలుగు చిత్ర పరిశ్రమకు తెలుగు హీరోయిన్లు కావాలని చాలామంది దర్శక,నిర్మాతలు అంటుంటారు. వింటూంటాం. కానీ వాస్తవంగా ఆ మాటలు చెప్పేవాళ్లు ఎవరూ ఆఫర్స్ ఇవ్వరు.

ఫలితం లేదు

ఫలితం లేదు

మన పరిశ్రమలో పని చేయడానికి ఎంతో ఇంట్రస్ట్ ఉన్నా నాకు ఫలితం లేకపోయింది.

ఫ్యాషన్ ఉండబట్టే కదా..

ఫ్యాషన్ ఉండబట్టే కదా..

నాలాంటి వాళ్లు వేరే పరిశ్రమలకు వెళ్లి ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నారంటే సినిమాలంటే ప్యాషన్ ఉండబట్టే కదా.

బ్యాగ్రౌండ్ లేకే

బ్యాగ్రౌండ్ లేకే

బ్యాగ్రౌండ్ లేని 23 ఏళ్ల అమ్మాయిని నేను. అవకాశమిస్తే నేనేంటో చూపించగలను తప్ప ఇంకే చేయగలను'' అని శోభిత చెప్పింది.

మంచి ఆఫర్స్

మంచి ఆఫర్స్

గుంటూరుకు చెందిన శోభిత.. తనకిప్పుడు బాలీవుడ్లో మంచి అవకాశాలే వస్తున్నాయని చెప్పింది.

ఖచ్చితంగా వస్తాయి

ఖచ్చితంగా వస్తాయి

తెలుగులో ఏదో ఒక రోజు అవకాశం వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. మరి ఆమెకు అవకాశాలిచ్చేవాళ్లెవరో? చూడాలి,.

నేపధ్యం

నేపధ్యం

జన్మతః మాది విశాఖపట్టణం. బిజినెస్ ఇన్ కార్పొరేట్ లా లో మాస్టర్స్ డిగ్రీ కోసం ప్రస్తుతం ముంబయిలో ఉంటోంది.

ఆడిషన్స్ లో

ఆడిషన్స్ లో

దక్షిణాది తరఫున హైదరాబాద్‌లో జరిగిన మిస్ ఇండియా ఆడిషన్స్‌లో పాల్గొనడమే గ్లామర్ రంగంలో ఆమె తొలి అడుగు.

దాంతో అందరి దృష్టిలో

దాంతో అందరి దృష్టిలో

అనంతరం అదే పోటీల్లో బెంగళూరులో మిస్ సౌత్‌గానూ ఆమె గెలిచారు. ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు.

అక్కడ నుంచే కెరీర్

అక్కడ నుంచే కెరీర్

ఫైనల్స్‌లో మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకున్నారు. అది ఆమెకు మోడలింగ్ అవకాశాల్ని పెంచింది.

బిజీ మోడల్ ని అయ్యా

బిజీ మోడల్ ని అయ్యా

అసలు మోడలింగ్ అనేదే నా కెరీర్‌ప్లాన్‌లో లేదు. అలాంటిది అనుకోకుండా బిజీమోడల్ అయిపోయాను.

అలా ఆఫర్

అలా ఆఫర్

ముంబయిలో జరిగిన మిస్‌దివా కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఫొటోగ్రాఫర్ అతుల్‌కస్బేకర్ కనిపించారు. కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌కు పనిచేస్తారా..! అనడిగారు. ఆశ్చర్యపోయాను.

విజయ్ మాల్యాకు

విజయ్ మాల్యాకు

ఎప్పుడూ చూడకపోయినా... పెద్ద పెద్ద స్టార్స్ అంతా చేసిన క్యాలెండర్ అని తెలుసు. గ్లామర్ రంగంలో తొలిమెట్టు మీదే ఉన్న నేను ఆ క్యాలెండర్లోనా? అనుకున్నాను. వెంటనే ఓకే చెప్పేశాను. అతుల్ నా ఫొటోలు విజయ్‌మాల్యాకు పంపారు.

English summary
Sobhita Dhulipala said: “I think a lot of people do say that the industry needs Telugu girls and seem keen too. But I feel people aren’t as keen as they say they are. But if you really want them to be a part of the industry you need to seek them out.’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu