Don't Miss!
- News
కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ బిగ్ స్కెచ్- ఏపీ సహా: 12 రోజుల పాటు..!!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సాహోకు ఎదురుదెబ్బ.. మూవీ నుంచి ఆ ముగ్గురు అవుట్.. రిలీజ్‌కు ముందు ఇలాంటి షాకా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రానికి ఎదురుదెబ్బ తగిలింది. సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్లు శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకోవడం చిత్ర యూనిట్‌ను షాక్ గురి చేసింది. ఈ అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బాహుబలి తర్వాత నేషనల్ లెవల్ ప్రాజెక్ట్‌గా రూపొందించాలనే లక్ష్యంతో యూవీ క్రియేషన్ స్టార్ మ్యూజిక్ త్రయంను రంగంలోకి దించింది. అయితే అనూహ్యంగా వారు చివరి నిమిషంలో గుడ్ బై చెప్పడంపై రకరకాల రూమర్లు మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే

సాహో నుంచి తప్పుకొన్నాం
సాహో చిత్రం నుంచి తప్పుకొన్నట్టు శంకర్ ఎహసాన్ లాయ్ తమ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సాహో సినిమా నుంచి మేము తప్పుకొన్నామని నా ఫ్యాన్స్‌కు తెలియజేయడానికి ఈ ట్వీట్ చేశాం. ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం లేదు. ప్రభాస్, సుజిత్, ప్రమోద్, శ్యామ్‌కు ఈ సినిమా ద్వారా మంచి విజయం దక్కాలని కోరుకొంటున్నాం అని శంకర్ ఎహసాన్ లాయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

వ్యక్తిగత విభేదాలే కారణమని
గాయకుడు శంకర్ మహాదేవన్, సంగీతకారులు ఎహసాన్ నురానీ, లాయ్ మెండోన్సా ముగ్గురు కలిసి బాలీవుడ్, కోలీవుడ్‌లో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అయితే ఈ ముగ్గురు సినిమా నుంచి తప్పుకోవడానికి పోస్టర్ వివాదమే కారణమని తెలుస్తున్నది. చిత్ర యూనిట్‌కు ఈ ముగ్గురు మ్యూజిక్ పండితుల మధ్య పోస్టర్ వివాదం చిచ్చురేపినట్టు సమాచారం.

పోస్టర్ వివాదంతో చిచ్చు
సాహో చిత్రం రిలీజ్‌కు సిద్దమవుతున్న నేపథ్యంలో పోస్టర్ల ప్రచారాన్ని చిత్ర యూనిట్ ఉధృతం చేసింది. ఈ పోస్టర్లలో శంకర్, ఎహసాన్, లాయ్ పేర్లు కనిపించడంకపోవడంతో ఆ ముగ్గురు మనస్తాపం చెందారట. ఆ తర్వాత వారి మధ్య చోటు చేసుకొన్న వాగ్వాదం సినిమా నుంచి బయటకు రావడానికి కారణమైందని ఓ వార్త మీడియాలో వైరల్ అవుతున్నది.

ఆగస్టు 15న విడుదల
అత్యంత భారీ బడ్జెట్‌తో సాహో చిత్రం రూపొందుతున్నది. దాదాపు 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో అత్యాధునికంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రద్దాకపూర్ టాలీవుడ్‌లో ప్రవేశించారు. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఇంకా ఈ చిత్రంలో తమిళ నటుడు అరుణ్ విజయ్, బాలీవుడ్ నటులు మందిరా బేడి, చంకీ పాండే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.దర్శకుడు సుజిత్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానున్నది.