»   » షాకింగ్: బాహుబలి ఆడియో లీకైంది? కావాలనే చేసారా?

షాకింగ్: బాహుబలి ఆడియో లీకైంది? కావాలనే చేసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి' ఆడియో ఈ నెల 13న తిరుపతిలో భారీగా వేడుక నిర్వహించి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్శీటీకి చెందిన కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి.

అయితే ఉన్నట్టుండి ఓ షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. బాహుబలి ఆడియో ట్రాక్స్ వాట్సాఫ్ ద్వారా లీక్ అయ్యాయి. ఇప్పటికే ఇవి అందరికీ షేర్ అయ్యాయి. ‘బాహుబలి'పై అంచనాలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో వాటిని తగ్దించడంలో భాగంగానే రాజమౌళి అండ్ టీం కావాలని వీటిని లీక్ చేసినట్లు ఓ ప్రచారం కూడా జరుగుతోంది.


అయితే ఇవి నిజంగానే ‘బాహుబలి' సినిమాకు సంబంధించిన ఆడియో ట్రాక్స్ అవునా? కాదా? అనే విషయంమై సరైన క్లారిటీ లేదు. ఎందుకంటే ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన ఆడియో ట్రాక్ లిస్ట్ విడుదలైంది. ఆ లిస్టుకు, తాజాగా లీకైన ఆడియో ట్రాక్స్ కు అసలు పొంతనే లేదు.


SHOCKING: Baahubali Songs Leaked Online Before Audio Release

ఒక వేళ తాజాగా లీక్ అయిన సాంగ్స్ నిజమైనవే అని అనుకుంటే... ‘జీవనది సాంగ్' ఓల్డ్ గెటప్ లో అనుష్క ఇంట్రడక్షన్ సాంగ్ అని భావించవచ్చు. ‘ఎవడంటా ఎవడంటా' అనే లీక్ సాంగ్ కీరవాణి వాయిస్ తో బాహుబలి క్యారెక్టర్ కు సంబంధించి దగ్గరగా ఉంది.


ఇటీవల లీకైన్ ఆడియో ట్రాక్ లిస్ట్ క్రింది చూడొచ్చు. అయితే తాజాగా వాట్సాఫ్ లో లీక్ అయిన ఆడియో ట్రాక్ లిస్టులకు, ఈ క్రింద పేర్కొన బడిన పాటల ట్రాక్ లిస్టులకు అసలు పొంతన లేదు.
1. వినవయ్యా...
2. నిను చూడకుండా...
3. ఓ శివుడా
4. ఇది ప్రేమేనా...
5. యుద్ధం థీమ్ 1
6. ఇది ప్రేమేనా..
7. యుద్ధం థీమ్ 2
8. రారా బలి..ఓ బాహుబలి (ధీమ్)
9. అవంతిక ఓ అవంతిక...
10. యుద్ధం థీమ్ 3


బాహుబలి ఆడియో వేడుక తిరుపతిలో జరుగుతోంది. ఆడియో వేడుకలో ఎలాంటి సమస్య ఏర్పడకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. సినిమా హాలీవుడ్ ప్రమాణాలకు దగ్గరగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇదో గొప్ప చిత్రం. 250 కోట్ల ఖర్చుతో...రెండు భాగాలుగా తెరకెక్కుతోది. తొలి భాగం జులై 10న ‘బాహుబలి - ది బిగినింగ్' పేరుతో తెరకెక్కుతుంది. రెండో భాగం 2016లో విడుదల కానుంది.

English summary
Unusual hype around Baahubali has become a bane on the part of director Rajamouli and Producer Shobu Yarlagadda, of late. Ofcourse that great hype made the film a much bigger one with investments pouring in from all corners.
Please Wait while comments are loading...