»   » దిల్ రాజు సాహసం చేస్తున్నాడా?? భారతీయుడు సీక్వెల్ బడ్జెట్ వింటే కళ్ళు చెదురుతున్నాయ్

దిల్ రాజు సాహసం చేస్తున్నాడా?? భారతీయుడు సీక్వెల్ బడ్జెట్ వింటే కళ్ళు చెదురుతున్నాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dil Raju Had Producing Biggest Production With An Estimated Budget

భారీ బట్జెట్‌తో విజువల్ వండర్స్ క్రియేట్ చేసేందుకు తపించే శంకర్ కొత్త కథలు ఎంచుకోవడం కంటే ఇప్పటికే పాప్యులరైన క్యారెక్టర్స్‌కు ఇంకాస్త క్రియేటివిటీ జోడించేందుకు ఉత్సాహపడుతున్నాడట. ప్రస్తుతం రోబోకు సీక్వెల్ '2.0' తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత తన కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ 'భారతీయుడు' చిత్రానికి కూడా సీక్వెల్ చేయాలని భావిస్తున్నాడట శంకర్. నిజానికి అటు కమల్ అభిమానులు, ఇటు శంకర్ శ్రేయోభిలాషులు ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే భారతీయుడు సీక్వెల్

త్వరలోనే భారతీయుడు సీక్వెల్

ఈ నేపథ్యంలోనే భారతీయుడు సినిమాకు సీక్వెల్ వార్త తెరపైకొచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల నుంచి ఇప్పుడందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే భారతీయుడు సీక్వెల్ మొదలయ్యే అవకాశముందట. ఈ విషయమై శంకర్-కమల్ మధ్య చర్చలు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఓ వైపు కమల్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

 అప్పట్లో ఓ పెను సంచలనం

అప్పట్లో ఓ పెను సంచలనం

సరిగ్గా 2 దశాబ్ధాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో ఓ పెను సంచలనం సృష్టించింది. ఒకప్పుడు వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. చాలా కాలం పాటు ఆ సినిమా మేనియా కొనసాగింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్

బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్

అయితే ఆ సినిమాకు దిల్ రాజు కేటాయించిన బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్. అప్పుడు ఆ సినిమా పెద్దగా హంగులు.. ఆర్భాటాలు లేకుండా అవినీతిని అంతం చేసేందుకు కన్న కొడుకును కూడా చంపేసే స్వాతంత్ర్య సమరయోధుడిగా కథగా తెరకెక్కింది. అదే సినీ ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టిస్తే.. ఇప్పుడు భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సీక్వెల్ ఏ రేంజ్‌లో ఉంటుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

200కోట్ల బడ్జెట్‌

200కోట్ల బడ్జెట్‌

కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇండియన్-2 త్వరలో తెరకెక్కనుంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఒక్కసారే తెరకెక్కనున్న ఈ సినిమాను ఇతర భాషల్లోకి సైతం అనువదించనున్నారు. అయితే దిల్ రాజు ఈ సినిమాకు రూ.200కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ రోబో-2ను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పూర్తవగానే ఇండియన్-2ను మొదలుపెట్టనున్నారని సమాచారం.

English summary
While Dil Raju had produced many big films in Telugu, this will be his biggest production with an estimated budget of Rs 150 to 200 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu