»   » షాక్: స్టార్ హీరో మోకాలికి సర్జరీ,ఆపరేషన్ జరిగేటప్పుడు వీడియో ఇది

షాక్: స్టార్ హీరో మోకాలికి సర్జరీ,ఆపరేషన్ జరిగేటప్పుడు వీడియో ఇది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్‌, ఫైటింగ్‌ సన్నివేశాల కోసం నటీనటులు చాలా కష్టపడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఊహించని విధంగా గాయపడుతుంటారు. తాజాగా హీరో జాన్‌ అబ్రహం కూడా ఇలాగే గాయపడి సర్జరీ చేయించుకున్నారు.

తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా జాన్‌ అబ్రహం ఈ విషయం తెలుపుతూ.. ఒక వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోకు అభిమానుల నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. జాన్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ వీడియోలో ఆయన మోకాలికి వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్న దృశ్యాలున్నాయి. 'ఫోర్స్‌-2' చిత్రీకరణ సమయంలో మోకాలికి మూడు సర్జరీలు చేయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

'సినిమా చేస్తున్నప్పుడు మేము రక్తాన్ని, స్వేదాన్ని చిందిస్తామనడానికి నిదర్శనం ఇది. 'ఫోర్స్‌-2' సినిమా చిత్రీకరణ సమయంలో నా మోకాలికి 3 సర్జరీలు చేయించుకున్నా' అని జాన్‌ అబ్రహం ట్వీట్‌ చేశారు.

2011లో విడుదలైన 'ఫోర్స్‌' చిత్రానికి సీక్వెల్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తున్నారు. అభినయ్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విపుల్‌ అమృత్‌లాల్‌ షాహ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబరు 18న 'ఫోర్స్‌-2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. . చిత్రం ట్రైలర్ ని విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఫోర్స్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో ప్రముఖ నటి జెనీలియా కీలక పాత్రలో కనిపించనున్నట్లు చిత్రయూనిట్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో వెంకటేశ్ నటించిన 'ఘర్షణ' కు రీమేక్‌గా ఫోర్స్ ను తెరకెక్కించారు. సోనాక్షిసిన్హా ఇటీవలే అకీరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

English summary
Sharing on Twitter, John Abraham posted a video which portrays his surgery saying, “When we say “blood and sweat” goes into a film..we mean it.On my way to 3 knee surgeries while shooting for Force2thefilm.” John Abraham had to undergo not one but three operations to recoup from the injuries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu