twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐశ్వర్య కూతురుపై..కో అంటే కోట్ల వర్షం

    By Bojja Kumar
    |

    ఈ లోకంలోకి వచ్చి వారమైనా తిరక్కముందే అందాల తార ఐశ్వర్యరాయ్ కూతురు కొన్ని కోట్లు సంపాదించబోతోంది. అయితే ఆమె సంపాదించాలా? వద్దా? అనేది మాత్రం బిగ్ బి కుటుంబం నిర్ణయం మీదనే ఆధార పడి ఉంది.

    ఐష్ కూతురు తొలి ఫొటోలు, వీడియోల కోసం మీడియా సంస్థలు పోటీ పడుతున్నాయి. జాతీయ స్థాయిలోనే కాదు... అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ పోటీ జోరందుకుంది. 'బుల్లి ఐష్ ఫొటో ప్రథమంగా తమకిస్తే... ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా సిద్ధం" అంటూ కొన్ని మీడియా సంస్థలు బిగ్ కుటుంబానికి భారీ ఆఫర్ ను ప్రకటించాయి.

    విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఓ అమెరికన్ మీడియా సంస్థ ఐశ్వర్య కూతురు తొలి ఫోటోలు, వీడియోలు తమకిస్తే 60 లక్షల అమెరికన్ డాలర్లు ఇవ్వడానికి సిద్ధ పడినట్లు తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ లెక్కలో 60 లక్షల డాలర్లంటే 30 కోట్ల రూపాయలు. గతంలో అంజలీనా జూలీ-బ్రాడ్ ఫిట్ దంపుతుల సంతానికి సంబంధించిన ఫోటోలను ప్రచురించుకున్నందుకు 60 లక్షల డాలర్లు ముట్టజెప్పిందో ఓ మీడియా సంస్థ. తాజాగా అదే రేంజ్ లో ఐశ్వర్య-అభిషేక్ సంతానికి ఆఫర్ రావడం గమనార్హం.

    అయితే బిగ్ బి కుటుంబం మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 'బేటీ బి" ఫోటోలు, వీడియోలు ఇప్పటి వరకు బయటకు విడుదల చేయలేదు కాబట్టి ఆమె ఫోటోలు అమ్ముకోవడానికి బచ్చన్ కుటుంబం నిర్ణయించుకున్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే మరింత పెద్ద ఆఫర్ వస్తుందనే ఉద్దేశ్యంతోనే వాళ్లు స్పందించడం లేదు కాబోలు అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

    English summary
    The birth of Aishwarya Rai's daughter last week made front page headlines all over the world. Aishwarya isn't just India's biggest star, she's an internationally admired actress, which is why it's unsurprising that international publications are eager to get their hands on the first-ever photo of Aishwarya and Abhishek's baby. What is surprising is the amount of money being offered for the privilege.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X