»   » హీరోయిన్ గా రాజశేఖర్‌ కుమార్తె శివాని, హీరో,నిర్మాత డిటేల్స్ (శివాని లేటెస్ట్ ఫొటోలతో)

హీరోయిన్ గా రాజశేఖర్‌ కుమార్తె శివాని, హీరో,నిర్మాత డిటేల్స్ (శివాని లేటెస్ట్ ఫొటోలతో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె... మెగా ప్రిన్సెస్ నీహారిక కొణిదెల...ఒక మనసు చిత్రంతో తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే ఆమెకు హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే హీరో నాగశౌర్యతో మరో నటుడు కుమార్తె తెరంగ్రేటం చేస్తోంది. ఆమె మరెవరో కాదు శివాని.

హీరోగా ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్‌ కుమార్తె శివాని హీరోయిన్ గా రంగప్రవేశం చేయబోతోందా? అవుననే అంటున్నాయి తెలుగు సిని వర్గాలు. నాగశౌర్య హీరోగా నటించే ఓ చిత్రంలో శివాని హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. ఇదో థ్రిల్లర్‌ కథ అని తెలుస్తోంది. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగుతున్న వారాహి బ్యానర్ పై నిర్మింతం కానుందని సమాచారం. కొర్రిపాటి సాయి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నదని తెలుస్తోంది.

శివాని తొలి చిత్ర సంగతులు రహస్యంగా ఉంచాలని రాజశేఖర్‌, జీవిత భావిస్తున్నారట. అందుకే వివరాలు బయటకు చెప్పడం లేదు. దర్శకుడెవరు? ఎప్పుడు మొదలవుతుందన్న విషయాలు అతి త్వరలో తెలుస్తాయి.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..

వారసత్వంగా వస్తోంది

వారసత్వంగా వస్తోంది

నిజం చెప్పాలంటే తండ్రి హీరో,తల్లి హీరోయిన్ ..వీళ్లకు పుట్టిన బిడ్డ సినీ పరిశ్రమను వదిలి ఎక్కడకు వెళ్తుంది. ఆమె పుట్టి, పెరిగింది మొత్తం తెలుగు సినిమా వాసనలతోనే. ఎంత రిస్ట్రిక్ గా ఉన్నా తన తండ్రి సినిమాల సమాచారం తెలుస్తూనే ఉంటుంది. తల్లి నటిగా చేసిన సినిమాలు, డైరక్ట్ చేసిన సినిమాలు చూసే ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని అంతా ఆశించారు. అదే నిజమైంది

వందకు వంద సినిమాలో

వందకు వంద సినిమాలో

గతంలో శివాని ఓ సినిమాలో చేసింది. అయితే ఆ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. వందకు వంద టైటిల్ తో రూపొందిన ఈ చిత్రంలో నటించేటప్పటికి ఆమెకు 17 సంవత్సరాలు మాత్రమే. జీవిత రాజశేఖర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసింది. తల్లి డైరక్షన్ లో నటించిన ఆమె తన కలలు నిజమౌతున్నాయని ఆనందపడింది. అలాగే ఆమె ఆ చిత్రంలో స్కూల్ గర్ల్ గా కనిపించి అలరించింది.

 మరి రెండో కుమార్తె విషయం

మరి రెండో కుమార్తె విషయం

రాజశేఖర్, జీవత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ ఆడపిల్లలే. శివాని, శివాత్మిక వారి పేర్లు. వారు ఇధ్దరు అంటే తల్లి తండ్రులకు భలే మురిపెం. తమ పిల్లలను చాలా ప్రేమగా ,గారాబంగా పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పెద్ద అమ్మాయిని హీరోయిన్ గా లాంచ్ చేస్తున్నారు. మరి రెండో అమ్మాయి కూడా త్వరలో లాంచింగ్ అవుతుందా అనేదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్, మరి ఆ అమ్మాయి ఆసక్తులు ఏమిన్నాయో తెలియదు కదా.

లాంచింగ్ వరకూ అంతా హ్యాపీ

లాంచింగ్ వరకూ అంతా హ్యాపీ

తల్లి,తండ్రులకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు, ఇన్లిప్లూయిన్స్ ఖచ్చితంగా శివాని లాంచింగ్ కు ఉపయోగపడతాయనటంలో సందేహం లేదు. అయితే ఆమె ఎంతవరకూ వాటిని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలుగుతుందనేది ఆమె ముందున్న పెద్ద ప్రశ్న. శివాని కు మాత్రం నటనలో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం ఉంది. హావభావాలు చక్కగా పలుకుతుందని చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ఖచ్చితంగా నిలదొక్కుతుంది.

యంగ్ హీరోతో సరైన జోడి

యంగ్ హీరోతో సరైన జోడి

నాగశౌర్యతో ఈమె ఈ చిత్రంలో లాంచ్ అవటం సరైన డెశిషన్. వీరిద్దరూ ఫెరఫెక్ట్ జోడి అనే చెప్పాలి. ఎందుకంటే నాగశౌర్యకు కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. నాగశౌర్య ప్రక్కన చేయటంతో శివాని కూడా యూత్ లోకి దూసుకువెళ్లే అవకాసం ఉంది. ఈ విషయమై జీవిత,రాజశేఖర్ లు సరైన నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి. అయితే మెగా డాటర్ తొలి చిత్రంలా కాకుండా అన్ని వర్గాలను అలరించే చిత్రం అయితే ఆమె కెరీర్ కు ఢోకా ఉండదు.

 ఖచ్చితంగా అంతా హైలెట్

ఖచ్చితంగా అంతా హైలెట్

రాజశేఖర్ కుమార్తె హీరోయిన్ గా లాంచ్ అవుతోందంటే ఖచ్చితంగా అందరి దృష్టీ ఈ సినిమాపై ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ముఖ్యంగా మీడియాలో ఈ సినిమా బాగా నానుతుంది. ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అయితే మీడియా హైప్ ని జాగ్రత్తగా వాడుకుంటే శివాని తెలుగులో లాంచింగ్ చిత్రంతోనే సెటిల్ అయిపోతుంది. ఈ సినిమాపై ఏర్పడే అంచనాలును అందుకోవటంలోనే ఆమె ప్రతిభ ఉంది.

నాగబాబు కుమార్తె

నాగబాబు కుమార్తె

ఈ మధ్యకాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుని లాంచింగ్ హీరోయిన్ ఎవరూ అంటే నాగబాబు కుమార్తె నీహారిక కొణిదెల అని చెప్పాలి. ఆమె టాలీవుడ్ లో పేరున్న మెగా కుటుంబం నుంచి రావటంతో లాంచింగ్ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. రామరాజు దర్శకత్వంలో వచ్చిన ఒక మనస్సు చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోయినా హీరోయినా గా ఆమె లాంచింగ్ జయప్రదంగా జరిగిందనే చెప్పాలి. ఈ సినిమాతో మెగా టాటర్ జనాల్లోకి వెళ్లిపోయింది.

 శృతిహాసన్ గురించి చెప్పాలా

శృతిహాసన్ గురించి చెప్పాలా

కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ కుమార్తె ఇప్పటికే దుమ్మురేపుతోంది. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో ఆమెకు తిరుగులేదు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన చేసిన ఆమె కు డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనన్ని ఆఫర్స్ వస్తున్నాయి. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఆమె దక్షిణాదిలో పాతుకుపోయిందనే చెప్పాలి. శృతి హాసన్ డేట్స్ కోసం నిర్మాతలు, హీరోలులు ఎదురుచూసే పరిస్దితి ని క్రియేట్ చేసుకుంది.

 యాక్షన్ స్టార్ కుమార్తె అంటే

యాక్షన్ స్టార్ కుమార్తె అంటే

యాక్షన్ స్టార్ అర్జున్ కుమార్తె లాంచింగ్ అనగానే అందరూ ఆసక్తిగా చూసారు. అసుల అర్జున్ కు ఓ కుమార్తె ఉందని, ఆమె తెరంగ్రేటం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ అర్జున్ కుమార్తె హీరోయిన్ గా లాంచ్ అయ్యింది.

వరలక్ష్మి రచ్చ చేసిందిగా

వరలక్ష్మి రచ్చ చేసిందిగా

తమిళనాట హీరోగా ఓ వెలుగు వెలిగిన యాక్షన్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అప్పట్లో అదరకొట్టింది. ఆమె కు ఇప్పటివకీ కంటిన్యూగా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. మరో హీరో విశాల్ తో ప్రేమాయణం ప్రక్కన పెడితే ఆమె ఎప్పుడూ ఏదో విధంగా వార్తల్లో ఉంటూనే వస్తోంది. వరలక్ష్మి తన నటనవారసురాలు అని శరత్ కుమార్ చాలా సార్లు తండ్రిగా గర్వపడ్డారు.

 షి సినిమాతో ఎంట్రీ

షి సినిమాతో ఎంట్రీ

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, రచయితగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉత్తేజ్, తాజాగా తన కుమార్తెను కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. రమేష్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందనున్న ‘షి' అనే సినిమా ద్వారా ఉత్తేజ్ కుమార్తె చేతన హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో లిటిల్ సోల్జర్స్ అనే సినిమాలో బాల నటిగా మెప్పించిన చేతన, ‘షి'తో హీరోయిన్‌గా మెప్పించేందుకు సిద్ధమయ్యారు.

 సూపర్ హిట్ అయ్యే అవకాసం

సూపర్ హిట్ అయ్యే అవకాసం

తొలి చిత్రంతోనే శివాని సూపర్ హిట్ ఇవ్వాలని కోరుకుంటోంది వన్ ఇండియా తెలుగు. ఇచ్చే అవకాసం కూడా ఉంది. ఎందుకంటే నాగశౌర్య వంటి యూత్ లో క్రేజ్ ఉన్న హీరో, ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నిర్మాత,పంపిణీదారుడు అయిన కొర్రపాటి సాయి బ్యానర్ వెనక ఉండటం కలిసివచ్చే అంశం. అలాగే ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉంటున్న తల్లి,తండ్రులు అండ ఉండనే ఉంటుంది. రాజశేఖర్ అభిమానులు కూడా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెడతారు.

English summary
Shivani, the daughter of Rajsekhar-Jeevitha is going to make debut this year. Rajsekhar is planning to launch her daughter and she is likely to play the love interest of Naga Shourya for the upcoming untitled movie which is going to be bankrolled by Sai Korrapati.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu