»   » నయన్ విషయం లో రామ్ చరణ్ అందుకే వెనక్కుతగ్గాడా..!? మూడుకోట్లు ఉంటే రండీ మాటలనవసరం...

నయన్ విషయం లో రామ్ చరణ్ అందుకే వెనక్కుతగ్గాడా..!? మూడుకోట్లు ఉంటే రండీ మాటలనవసరం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ చలన చిత్ర రంగంలో నటి నయనతార హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవల తెరకెక్కిన 'ఇరుముగన్‌' చిత్రం విజయవంతం కావడానికి నయనతార అదృష్టమే కారణమంటున్నారు కొందరు. ఆమె నటిస్తున్న చిత్రాలు వరుసగా హిట్‌ కావడంతో తమిళ సినీ పరిశ్రమ ఆమెను నెంబర్‌ ఒన్‌ స్థానానికి తీసుకెళ్లింది. ప్రేక్షకులు కూడా ఆమెపై కాస్త ఎక్కువుగానే అభిమానం చూపుతున్నారు.

నయన్‌ నటించి ఇటీవల విడుదలైన తిరునాళ్‌, ఇదు నమ్మ ఆళు, నానుం రౌడీ దాన్‌, మాయా, తని ఒరువన్‌ తదితర చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. ఇరుముగన్‌ చిత్రంలో కథానాయకుడు విక్రమ్‌ సరసన నటించిన నయనతార తన నటనా చాతుర్యంతో కుర్రకారును ఉర్రూతలూగిస్తున్నారు. ఇదివరకు నటుడు విక్రమ్‌ నటించిన చిత్రాలు ­హించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సమయంలో ఇరుముగన్‌ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో విక్రమ్‌ సంతోషంలో తేలియాడుతున్నాడు.

అసలుతమిళ చిత్ర రంగంలో నయనతారకి వున్న క్రేజ్ ఎంత అనేది చెప్తే మనకి అర్థం కాదు. నయనతార వున్న సినిమాలని తమిళ జనం ఎగబడి చూసేస్తుంటారు. గత పదేళ్లలో ఇంతటి స్టార్డమ్ తెచ్చుకున్న హీరోయినే లేదంటారు. తన డిమాండ్ ఏంటనేది నయనతారకి బాగా తెలుసు. అందుకే అందుకు తగ్గట్టే పారితోషికం ఫిక్స్ చేసింది. హీరోతో సంబంధం లేకుండా, బడ్జెట్తో పని లేకుండా తన రేట్ మూడు కోట్లు అని నయనతార తేల్చేసింది. ఆ రేటు ఒక్క రూపాయి కూడా తగ్గదని, బేరాలాడే ఉద్దేశం వుంటే ఇక తనని సంప్రదించవద్దని నయనతార స్పష్టం చేసింది.

Nayanthara

ఇంతవరకు హీరోయిన్ పారితోషికం కోటిన్నరకి మించి ఇచ్చి ఎరుగని తమిళ నిర్మాతలు కూడా నయనతార డిమాండ్లకి తలొగ్గుతున్నారు. బడ్జెట్, హీరో అంటూ కండిషన్లు లేవు కనుక ఆమె క్రేజ్ని వాడుకునే వీలుందని తన రేటుతో సంబంధం లేకుండా క్యూ కడుతున్నారు. తమిళ వాళ్లు అడిగినంత ఇస్తున్నప్పుడు తెలుగు సినిమాలెందుకు చేయాలని నయనతార భావించడంలో తప్పులేదు. అందుకే చిరంజీవి సినిమాకి కూడా ఆమె మెట్టు దిగలేదు. తను అడిగిన పారితోషికానికి దిమ్మ తిరిగిన చరణ్ తనకి బదులు కాజల్ అగర్వాల్ బెస్ట్ అని ఆమెని తీసుకున్నాడు.

దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌ నయనతారే. ఒక్కో సినిమాకు ఆమె దాదాపు మూడు కోట్ల రూపాయలు అందుకుంటోంది. అనుష్క వంటి టాప్‌ హీరోయిన్‌ కూడా రెండు భాషలకు కలిపి రెండు కోట్లు మాత్రమే తీసుకుంటుంటే.. నయన్‌ మాత్రం ఒక్క భాషలో విడుదలయ్యే చిత్రానికే మూడు కోట్లు వసూలు చేస్తోందట.

మాస్‌తోపాటు యూత్‌లో కూడా ఆమెకు క్రేజ్‌ ఉండడంతో అడిగినంత ఇచ్చేస్తున్నారట నిర్మాతలు. ఒకరకంగా చెప్పాలంటే ఆమె ప్రేమ వివాదాలే ఆమెను ఎప్పటికప్పుడు టాప్‌లో నిలబెడుతున్నాయి. అంత రెమ్యునరేషన్‌ అందుకుంటున్నా సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటుంది నయనతార. ఇప్పుడు నయనతార మరో కొత్త నిబంధన పెట్టిందట. తనకు ఇచ్చే మూడు కోట్ల రెమ్యునరేషన్‌ను పూర్తిగా వైట్‌మనీ రూపంలోనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోందట. దీంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట.

English summary
Nayana Tara is being referred to as the lady superstar, and filmmakers are queuing up to rope her in. The actress, however, according to industry sources, has hiked her remuneration by 50 per cent and currently quotes Rs3 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu