Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 4 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్కడ ఫట్.. ఇక్కడ హిట్.. ప్రభాస్ సాహో సెన్సేషన్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన 'సాహో' మూవీ తాజాగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. నిజానికి డిసాస్టర్ అయింది. కానీ బుల్లితెర, ఆన్ లైన్ వేదికలపై మాత్రం సత్తా చాటుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ భారీ టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.
సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో సాహో మూవీ రూపొందింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఒక్క హిందీలో తప్పితే మిగతా భాషల్లో ఈ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో గతేడాది అక్టోబర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, మలయాళ వర్షెన్స్‌ని అందుబాటులోకి తెచ్చారు. దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

కాగా సాహో హిందీ వర్షెన్‌ని జనవరి 26న జీ సినిమా ఛానెల్‌లో ప్రసారం చేశారు.
అయితే బ్రాడ్‌కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదల చేసిన నివేదిక ప్రకారం 'సాహో' టెలివిజన్ ప్రీమియర్ 128.20 లక్షల వ్యూయర్‌షిప్ రాబట్టింది. ఇంత వ్యూయర్‌షిప్ రావడం గ్రేట్ అంటున్నారు విశ్లేషకులు. బాహుబలి సినిమాతో హిందీ ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యారు ప్రభాస్. అందుకే సాహో హిందీ వర్షన్ సినిమాకి ఈ టీఆర్పీ వచ్చిందని అంటున్నారు.
ఇకపోతే ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు ప్రభాస్. లవ్ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు 'ఓ డియర్' పేరును పరిశీలిస్తున్నారు మేకర్స్.